• తాజా వార్తలు

సోషల్ మీడియా ను తెగ వాడేస్తున్న సీనియర్ సిటిజెన్ లు

దివరకు రిటైర్ అయిన వాళ్ళు ఏం చేసేవారు.కృష్ణా ,రామా అనుకుంటూ మనవళ్ళు మనవరాల్లతో కలిసి ఇంట్లో కూర్చుని శేష జీవితం హాయిగా గడిపే వారు.లేదా తీర్థ యాత్రలకు వెళ్లి పుణ్యం సంపాదించే పనిలో బిజీ గా ఉండే వాళ్ళు.మరి ఇప్పుడు సీనియర్ సిటిజెన్ లు ఎం చేస్తున్నారో తెలుసా?సోషల్ మీడియాను విపరీతంగా వాడే పనిలో చాలా బిజీ గా ఉన్నారు.ఆ కథేంటో ఒక్కసారి చూద్దాం రండి.

ముసలి వాళ్ళు సోషల్ మీడియా ను ఎం వాడుతారులే అనేది మీ అభిప్రాయమైతే వెంటనే మీ అభిప్రాయాన్ని మార్చుకోండి.ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం 65 సంవత్సరాల పైబడి వయసు ఉన్న వారిలో సుమారు 35 శాతం మంది సోషల్ మీడియాను వాడుతున్నారు.ఇది 2010 తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.అప్పుడు కేవలం 11 శాతం మాత్రమే వాడుతున్నట్లు వెల్లడించారు.యువతతో పోలిస్తే ఇది చాలా తక్కువ అయినప్పటికీ వారి వయసుకు ఇది చాలా ఎక్కువే! నేటి యువతలో దాదాపు 90 శాతం మంది సోషల్ మీడియా ను వాడుతున్నారు.

ఇంత మార్పు ఎందుకు వచ్చిందో ఈ సర్వే ఇదమిద్దంగా చెప్పలేకపోయింది కానీ మన పాఠకులు అంచనా వేయోచ్చని మేము భావిస్తున్నాము.ఏముంటుంది తమ పాత స్నేహితులను గుర్తుకు తెచ్చుకుని వీలయితే కలవడానికి,ఆ వయసులో వచ్చే వ్యాధుల కు సంబదించి అభిప్రాయాలు పంచుకోవడానికి,తరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి అని మేము అనుకుంటున్నాము.ఈ సర్వే సుమారు 62,000 ల ఇంటర్ వ్యూ లను నిర్వహించడం ద్వారా వచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని సమర్పించినది.

 

జన రంజకమైన వార్తలు