సోషల్ మీడియా అనగానే మనకు గుర్తొచ్చేది ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్.. వాటిలో న్యూస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే కళ్లు మూసి తెరిచేలోపే ఒక న్యూస్ వైరల్ అయిపోతుంది. అయితే ఈ న్యూస్‌లో ఏది కరెక్టో ఏది కాదో కూడా తెలియని పరిస్థితి. ఈ స్థితిలో ట్విటర్ ఒక టూల్‌ను వినియోగంలోకి తీసుకు రాబోతోంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను గుర్తించి వాటిని ఆపడానికి ఈ టూల్‌ను యూజ్ చేసుకోవాలని ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థ భావిస్తోంది.
త్వరలో లాంఛ్
మిస్ ఇన్ఫర్మేషన్.. ట్విటర్‌ను బాగా కుదిపేస్తున్న అంశాల్లో ఇదొకటి. ఎన్ని ఫిల్టర్లు పెట్టినా.. ఎంత చెకింగ్ పెట్టినా కూడా ఫేక్ న్యూస్ అనేది చాలా కామన్ విషయం అయిపోయింది. ఒక అకౌంట్‌ని బ్లాక్ చేస్తే మరో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిస్ ఇన్ఫర్మేషన్‌ను అరికట్టడానికి ఈ డిసెంబర్లో ట్విటర్ ఒక టూల్‌ను తీసుకొస్తోంది. రాజకీయాలు, సినిమా, క్రీడలు ఇతర ప్రాధాన్య న్యూస్‌లో ఎలాంటి ఫేక్ చొరబకుండా చూడడం కోసం ఈ టూల్ ఉపయోగపడుతుందట. ఇది పొలిటికల్ అడ్వర్టేజ్‌మెంట్‌ని కూడా ఆపుతుందట. ఉదాహరణకు ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువశాతం ట్విటర్ ద్వారానే ప్రచారం జరిగింది.
జనం భాగస్వామ్యంతో..
ఫాల్స్ న్యూస్‌ని అరికట్టడానికి ట్విటర్ చేసే ప్రయత్నాల్లో భాగంగా వస్తున్న ఈ కొత్త టూల్‌ని జనం భాగస్వామ్యంతో తీసుకు రావాలని మైక్రో బ్లాగింగ్ సంస్థ భావిస్తోంది. ఈ టూల్‌కు ఇంకా ఒక పేరు పెట్టకపోయినా.. ఇది జనం ద్వారా ఉపయోగించే టూల్ అని తెలుస్తుంది. ఉదాహరణకు ఒక ఫాల్స్ న్యూస్ తీసుకుంటే ఈ టూల్ ని ఉపయోగించి ఒక సర్వే నిర్వహిస్తారు. జనం ఈ న్యూస్ ఫేక్ లేదా నిజం అని చెబితే ఆ రిజల్ట్స్ మాత్రమే ఇస్తారు. అప్పుడే ఈ న్యూస్ మనకు కనిపిస్తుంది. అలాగే ప్రమాదకర వార్తలను ప్రచారంలోకి తీసుకు రాకుండా ఉండడం కోసం కూడా ఈ టూల్‌ని యూజ్ చేయబోతోంది ట్విటర్.