ఇన్‌స్టంట్ మెసేజ్ సర్వీస్ టెలిగ్రామ్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఈ సర్వీస్ మొబైల్ యాప్‌గానూ, వెబ్‌సర్వీస్‌గానూ కూడా అందుబాటులో ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 10 కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారని టెలిగ్రామ్ సగర్వంగా ప్రకటించింది. లాక్‌డౌన్ టైమ్‌లో తమ యాప్ డౌన్‌లోడ్స్ లక్షల్లోపెరిగాయని వెల్లడించింది.
బోల్డన్ని ఫీచర్లు
* వాట్సాప్ కంటే దీనిలో మంచి ఫీచర్లు ఉన్నాయి. వాట్సాప్‌లో ఏదైనా ఇమేజ్ పంపిస్తే అది కంప్రెస్ అయి వస్తుంది. క్వాలిటీ దెబ్బతింటుంది. అదే టెలిగ్రామ్‌లో అయితే ఎలా ఉన్న ఫోటోను అలాగే షేర్‌చేయొచ్చు. సైజ్, క్వాలిటీ ఏమాత్రం దెబ్బతినదు. అందుకే మీడియా సంస్థలు, ఫోటోగ్రాఫర్లు దీన్నిబాగా వాడుతున్నారు.
* మ్యాగ్జిమం 1జీబీ ఫైల్‌ను టెలిగ్రామ్ ద్వారా సెండ్ చేయొచ్చు.
* సెక్యూర్డ్ వీడియో కాల్ ఫీచర్ ఉంది. దీంతో జూమ్, హౌస్ పార్టీ లాంటి విదేశీ యాప్‌లకు మంచి కాంపిటీషన్ ఇస్తోంది.
* యానిమేటెడ్ ఐకాన్స్, 20వేల స్టిక్కర్ల క్యాటలాగ్‌తో యూజర్లను విశేషంగా కట్టుకుంటోంది.
రికార్డుల మోత
ఒక్క ఏడాదిలోనే 10 కోట్ల డౌన్‌లోడ్స్ సాధించింది. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 300 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉంటే ఈ ఏడాది 400 మిలియన్లకు చేరారు.
* రోజుకు 15 లక్షల మంది కొత్తగా టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
* 20 దేశాల్లో అత్యధిక డౌన్‌లోడ్స్ సాధిస్తున్న ఏకైక సోషల్ మీడియా యాప్ టెలిగ్రామేనట.