టిక్ టాక్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ ఫేమ్‌ను యూజర్లు మామూలుగా వాడుకోవడం లేదు టిక్‌టాక్‌లో భారీగా అభిమానులున్న కొంతమంది నిద్రపోయే సమయాన్ని కూడా నిద్రపోయే సమయాన్ని కూడా డబ్బుగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం వారు తమ సమయాన్ని కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు. విదేశాల్లో ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా హల్ చల్ చేస్తోంది.
స్లీప్ స్ట్రీమింగ్‌కు సై
ఒకరు ఇద్దరు కాదు వందల మంది టిక్‌టాక్ యూజర్లు ఈ ఈ స్లీప్ స్ట్రీమింగ్ చేస్తూ ట్రెండ్‌కు సై అంటున్నారు. అంతే కాదు భారీ ఫాలోయింగ్‌నూ సంపాదించుకుంటున్నారు. బ్రయాన్ హెక్టర్ అనే పద్దెనిమిదేళ్ల టిక్ టాక్ స్టార్ తన నిద్ర సమయాన్ని గత వారం లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. నేను ఉదయం లేచి చూసేసరికి నా నా ఫాలోయర్లు సంఖ్య 6,300 పెరిగింది అని బ్రయన్ ఉత్సాహంగా చెప్పాడు.
డొనేషన్లూ సంపాదిస్తున్నారు
యువాన్‌సన్ అనే టిక్‌టాక్ యూజర్ నేమ్‌తో చైనాకు చెందిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 9న స్లీప్ స్ల్రీమింగ్ చేశాడు. కరోనా వైరస్ అవుట్ బ్రేక్‌తో చైనాలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. అలా ఖాళీగా దొరికిన సమయంఓ యువాన్‌సన్ స్లీప్ స్ట్రీమింగ్ చేస్తే పిచ్చ వైరల్ అయింది. ఏకంగా 3లక్షల రూపాయల విలువైన వర్చువల్ గిఫ్ట్స్ ఆయనకు మిగిలిన యూజర్లు, టిక్‌టాక్ లవర్స్ పంపించారు.
ఎందుకీ స్లీప్ స్ట్రీమింగ్?
బేసికల్‌గా సోషల్ మీడియా అంటేనే ఏదో ఒకటి చేసి మిగిలినవారి అటెన్షన్‌ను మన వైపుకు తిప్పుకోవడం. ఫేస్‌బుక్‌లో పోస్టయినా, ట్విటర్‌లో ట్వీట్ అయినా, వాట్సాప్‌లో చాట్ అయినా ఇదే లెక్క. టిక్‌టాక్ అంటే లక్షల కొద్దీ వీడియోలు, వాటికి యూజర్ల యాక్షన్ జత కలిసి బాగా పాపులవుతున్నాయి. ఇలా పాపులరైన వాళ్లు స్ట్రీమింగ్‌లో కాస్త వెనకబడినా ఫాలోయర్స్ తగ్గిపోతుంటారు. అందుకే ఎప్పుడూ లైవ్‌లో ఉండాలనుకునే టిక్‌టాక్ స్టార్లకు స్లీప్ స్ట్రీమింగ్ ఓ కొత్త రూట్ అన్నమాట.