కాలర్ ఐడీ సర్వీస్ ట్రూ కాలర్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీకు ఫోన్ చేసే వ్యక్తి ఎందుకు కాల్ చేస్తున్నారో కూడా తెలుసుకునే కాల్ రీజన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఏమిటి ఉపయోగం?
ఈ కాల్ రీజన్ ఫీచర్ ద్వారా అవతలి వ్యక్తి మనతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో కూడా చెప్పే అవకాశం వస్తుంది. ఉదాహరణకు ఆఫీస్ వర్క్ అని లేదంటే రెస్టారెంట్‌కు వెళదామని ఇలా ఏదైనా రీజన్ చెబితే దాన్నిబట్టి ఆ కాల్ వెంటనే రిసీవ్ చేసుకోవాలా లేదా మనం డిసైడ్ చేసుకోవచ్చని ట్రూకాలర్ చెబుతోంది. ఇలా రీజన్ ఏంటో తెలుసుకోవడం వల్ల కాల్ పికప్ రేట్ పెరుగుతుందని అంటోంది. అంతేకాక కాల్ రీజన్ తెలిస్తే యూజర్ దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కూడా డిసైడ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పింది.
ఇద్దరికీ ట్రూకాలర్ ఉంటేనే
* ఈ కొత్త ఫీచర్ కాల్ రీజన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రూకాలర్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ట్రూకాలర్ ప్రకటించింది.
* అయితే ఈ ఫీచర్‌ను వాడుకోవాలంటే కాల్ చేసేవారు, రిసీవ్ చేసుకునేవారు ఇద్దరూ కూడా ట్రూ కాలర్ వాడుతుండాలి.
* ఈ కాల్ రీజన్ ఫీచర్‌ను అనేబుల్ చేసుకున్నాక కాలర్ కాల్ చేసేటప్పుడు రీజన్ కూడా ఎంటర్ చేయాలి. అప్పుడే రిసీవర్‌కు ఫలానా వ్యక్తి ఎందుకు కాల్ చేస్తున్నారో డిస్‌ప్లే అవుతుంది. ట్రూకాలర్ పాప్ అప్‌లో భాగంగానే పేరు, నంబర్‌తోపాటు కాల్ రీజన్ ఏంటో చెప్పే ఈ మెసేజ్ కూడా కనిపిస్తుంది.
* అక్కర్లేదు అనుకుంటే ఈ ఫీచర్‌ను డిజేబుల్ చేసుకోవచ్చు.