• తాజా వార్తలు

వాట్సప్, హైక్, ఫేస్ బుక్, స్కైప్ లలో వాయిస్/వీడియో కాలింగ్ విశేషాలు ఆక్టివేట్ చేయడం ఎలా ?

 

నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా విస్తృతి ఏ రకంగా ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమాయకత్వం తో కూడిన చిన్న పిల్లల నుండీ కరడుగట్టిన ఉగ్రవాదుల వరకూ అందరూ సోషల్ మీడియా ను ఉపయోగిస్తున్నారు.అనేకమంది సోషల్ మీడియా కు బానిస అవుతున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఇందులో చాలావరకూ వాస్తవం ఉంది. అయితే అది వేరే విషయం. ఇక్కడ విషయం ఏమిటంటే మొదట్లో కేవలం టెక్స్ట్ మెసేజ్ లకే పరిమితం అయిన ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లు ఇప్ప్పుడిప్పుడే వీడియో కాలింగ్ కు అలవాటు పడుతున్నాయి. ఈ మద్యనే వీటిలో కొన్ని తమ వీడియో చాటింగ్ సర్వీస్ లను లాంచ్ చేసాయి. సోషల్ మీడియా అనేది ఒక విప్లవాత్మక రీతిలో పెరిగిపోతుంది. వాట్స్ అప్, హైక్, ఫేస్ బుక్, మరియు స్కైప్ లు ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లు. ఇవి కాక మరికొన్ని మెసేజింగ్ యాప్ లు కూడా వీడియో కాలింగ్ ఫీచర్ లను కలిగిఉన్నాయి. కాకపోతే వాట్స్ అప్ మరియు హైక్ లు ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ఉంది. వీటికున్న వనరులు, సాంకేతిక పరిజ్ఞానం కూడా మిగతా వాటికంటే ఎక్కువే. అయితే ఇవి చాలా ఆలస్యం గా వీడియో కాలింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టాయి. ఎక్కువ మంది భారత వినియోగదారులు ఉన్న మెసేజింగ్ సర్వీస్ హైక్ అలాగే వర్చ్యువల్ కమ్యూనికేషన్ లో అగ్రగామిగా ఉంది పేస్ బుక్. ఈ నేపథ్యం లో ఎక్కువగా వాడబడుతున్న సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ గురించీ అవి ఈ మధ్యనే ప్రవేశపెట్టిన వీడియో కాలింగ్ ఫీచర్ లగురించీ ఒక విశ్లేషణ ఈ వ్యాసం.

ఫేస్ బుక్ మెసెంజర్

ఈ జాబితా లో ఫేస్ బుక్ మెసెంజర్ అగ్రస్థానం లో ఉంది. సోషల్ మీడియా దిగ్గజం అయిన పేస్ బుక్ తన మెసెంజర్ తో పాటు వాట్స్ అప్ ను కూడా విండోస్ 10 కోసం అప్ డేట్ చేసింది. ఈ అప్ డేట్ లో ఉన్న ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే వాయిస్ కాల్ లతో పాటు వీడియో కాలింగ్ ను కూడా ఇందులో చేర్చడమే.ఇప్పుడు ఫేస్ బుక్ మరియు వాట్స్ అప్ లలో కాల్స్ చేయాలి అనుకునే వారు యాప్ ను క్లోజ్ చేసి బ్రౌజర్ ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విండోస్ యాప్ దాదాపు ఆండ్రాయిడ్ యాప్ లాగే పనిచేస్తుంది. చాట్ స్క్రీన్ యొక్క కుడి భాగం లో పై వైపు ఒక ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. కాల్ ఆక్టివ్ లో ఉన్నపుడు ఈ బటన్ పచ్చ రంగులో కనిపిస్తుంది. దీనిని కేవలం ట్యాప్ చేయడం ద్వారా మీరు కాల్ లు చేయవచ్చు. కానీ డెస్క్ టాప్ యాప్ మాత్రం ఆండ్రాయిడ్ మరియు iOS యాప్ లు ఉన్నంత సౌకర్యవంతంగా ఉండదు. విండోస్ 10 యాప్ లో స్క్రీన్ యొక్క పై భాగం లో కుడి వైపు ఫోన్ ఐకాన్ ఉంటుంది. వేరే వ్యక్తీ ఆక్టివ్ గా ఉన్నపుడు ఇది పచ్చ రంగుల కనిపిస్తుంది. మీరు కాల్ లను స్టార్ట్ చేసినపుడు ఆ కాల్ కోసం వై ఫై ని ఉపయోగించాలా లేక మీ డేటా ప్లాన్ ను ఉపయోగించాలా అని ఇది మిమ్మల్ని అడుగుతుంది. పేస్ బుక్ కూడా తన మెసెంజర్ సర్వీస్ లో  ఉచిత కాల్ లను అనుమతిస్తుంది. ఎక్కువమంది తమ ఫోన్ లలో ఈ యాప్ ను కలిగిఉండడం చేత ఈ విషయం లో పేస్ బుక్ మెసెంజర్ కీ ఎక్కువ లాభం ఉంది.

వాట్స్ అప్

వాట్స్ అప్ ఈ మధ్యనే తన వీడియో కాలింగ్ ఫీచర్ ను లాంచ్ చేసింది.ఈ యాప్ యొక్క బీటా వెర్షన్ లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఈ వీడియో కాలింగ్ ఫీచర్  ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కొన్ని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఇప్పటికే చాలామంది వినియోగదారులు తమ ఫోన్ లలో ని వాట్స్ అప్ బీటా వెర్షన్ లలో దీని వాడకాన్ని మొదలుపెట్టినప్పటికీ వాట్స్ అప్ మాత్రం దీనికి సంబందించి ఏ విధమైన ప్రచారాన్ని మొదలుపెట్టలేదు. దీని వినియోగదారులు డయలర్ బటన్ ను ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ మరియు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. వాయిస్ కాల్ కు మరియు వీడియో కాల్ కు మధ్య ఒక డైలాగ్ ప్రత్యక్షం అవుతుంది. ఇది గూగుల్ ప్లే లో అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు తమ ఫోన్ లలో వాట్స్ అప్ యొక్క బీటా వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇందులో ఇన్ కమింగ్ వాయిస్ కాల్ ను కూడా చూడవచ్చు. గ్రీన్ బటన్ ను కుడి వైపుకి ట్యాప్ చేయడం ద్వారా కాల్ ను ఆన్సర్ చేయవచ్చు. రెడ్ బటన్ ట్యాప్ చేయడం ద్వారా కాల్ ను రిజెక్ట్ చేయవచ్చు. కాల్ ను కట్ చేసి మెసేజ్ పంపేందుకు మెసేజ్ ఐకాన్ కూడా ఇందులో ఉంటుంది.

హైక్

ఇండియా కు చెందిన హైక్ మెసేజింగ్ సర్వీస్ తన వీడియో కాలింగ్ ఫీచర్ ను ఈ మధ్యనే ప్ర్రారంభించింది. యువతే లక్ష్యం గా ఇది వీడియో కాలింగ్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ తో వీడియో కాలింగ్ అనుభవం చాలా సింపుల్ గానూ, నమ్మదగినది గానూ, హై క్వాలిటీ తో కూడుకున్నది గానూ ఉంటుంది. హైక్ లో వీడియో కాలింగ్ సింపుల్ గానూ ఉపయోగించడానికి చాల సులువుగానూ ఉంటుంది. నెట్ వర్క్ కండిషన్ లు సరిగా లేకపోయినా సరే ఇది అత్యుత్తమ హై క్వాలిటీ వీడియో కాలింగ్ సర్వీస్ ను అందిస్తుంది. మీ హైక్ మెసెంజర్ యాప్ రెండు నెలల క్రితం నుండీ అప్ డేట్ చేసుకోకపోతే వెంటనే అప్ డేట్ చేసుకోండి. మిగతా అని సర్వీస్ ల లాగీ ఇందులో కూడా కుడి వైపు ఉండే బటన్ ట్యాప్ చేయడం ద్వారా వీడియో కాలింగ్ ను చేయవచ్చు.

స్కైప్

స్కైప్ ను రీ డిజైన్ చేసి ఒక సరికొత్త వెర్షన్ ను రానున్న కొన్ని వారాల్లో అందుబాటులోనికి తీసుకురానున్నట్లు మైక్రో సాఫ్ట్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటి లోనూ అద్భుతంగా పనిచేసేలా మైక్రోసాఫ్ట్ దీనిని తీర్చి దిద్దుతుంది.

స్మార్ట్ ఫోన్ ల కోసం చేసిన దీని రీ డిజైన్ ప్రత్యేకంగా వీడియో మరియు వాయిస్ కాల్ ల కోసమే చేయబడింది. ఇది ఇందులో ఉండే కాల్ ఫోన్ ట్యాబ్ అనే ట్యాబ్ బదులు కాల్స్ అనే ట్యాబ్ ను ఉంచింది. దీనివలన రిసీవర్ ఏ పరికరం నుండి అయినా కాల్ అటెంప్ట్ చేయవచ్చు. ఇది కాలింగ్ కు వన్ ట్యాప్ యాక్సెస్ ను కల్పించింది. ఈ కాల్స్ అనే ట్యాబ్ స్కైప్ ఆడియో/ వీడియో కాల్ లకూ మరియు స్కైప్ క్రెడిట్ ను ఉపయోగించే వేరే నంబర్ లకూ ఇది యాక్సెస్ ను కల్పిస్తుంది. సంప్రదాయ వాయిస్ మెయిల్ లో ఉండే అనేక అవుట్ డేటెడ్ ఫీచర్ లను ఇది చంపివేస్తుంది. కస్టమ్ ఈ మెయిల్ పింగ్స్, వాయిస్ మెయిల్ గ్రీటింగ్ మరియు SMS లను క్రియేట్ చేసుకునే ఆప్షన్ లను ఇది తొలగించివేసింది. ఈ ఫీచర్ ఇప్పటికే iOS లో అందుబాటులో ఉంది.

 

జన రంజకమైన వార్తలు