• తాజా వార్తలు

ఈ యాప్స్ వాడారా? అయితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేయడం ఖాయం

ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ యూజర్లతో దూసుకుపోతోంది. అత్యధిక జనాదరణ పొందిన ఈ యాప్ ను చాలామంది తమ దుర్వినియోగానికి వాడుకుంటున్నారు. ఇప్పటివరకు వాట్సాప్ యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయినా ఫలితం లేకుండా పోతోంది. ఆగడాలు కొనసాగుతైనే ఉన్నాయి. అయితే జిబి వాట్సాప్ లేదా వాట్సాప్ ప్లస్ వాడే థర్డ్ పార్టీ యూజర్లకు వార్నింగ్ మెసేజ్ లను కూడా పంపించింది వాట్సాప్ యాజమాన్యం. ఒకవేళ మీరు కానీ కింద పేర్కొన్న యాప్స్ వాడాతున్నారా? వాడుతున్నట్లయితే తక్షణమే డిలీట్ చేయండి. ఎందుకంటే ఈ యాప్స్ ను మీరు వాడినట్లయితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేయడం ఖాయం. 

1.GBవాట్సాప్....
కొంతమంది థర్డ్ పార్టీ వాళ్లు క్రియేట్ చేసిన మోడెడ్ వెర్షన్ వాట్సాప్ యాప్స్ ను వాడుతున్నారు. అఫిషీయల్ యాప్ లో లేనటువంటి కొన్ని ఫీచర్లు ఈ యాప్స్ లో ఉన్నాయి. దీంతో కొందరు ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. 

2. YOవాట్సాప్....
అదనపు ఫీచర్లు ఉన్నాయి కదా అని ఈ యాప్ ఉపయోగించినట్లయితే అసలుకే మోసం వస్తుందని వాట్సాప్ హెచ్చరించింది. ఈ యాప్ వల్ల హ్యాకింగ్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. పర్సనల్ మెసేజ్, చాట్ హిస్టరీ, కాంటాక్ట్స్ డిటైల్స్ వంటివి హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొందమంది యూజర్లను ఈ యాప్ ను బ్యాన్ చేసినట్లయి వాట్సాప్ ప్రకటించింది. వీటితోపాటుగా ఈ కింది యాప్స్ కానీ మీరు డౌన్ లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి. 
3. WhatsApp Plus
4. BSE వాట్సాప్
5. FM వాట్సాప్ 
6. YC వాట్సాప్
7. OG వాట్సాప్
8.  వాట్సాప్ MA
9. వాట్సాప్ INDIGO
10. ZE వాట్సాప్
 
 

జన రంజకమైన వార్తలు