ప్రస్తుతం ఒక బిలియన్ కు పైగా వినియోగదారులతో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో ఒకటి గా నిలిచింది వాట్స్ అప్. ఇది టాప్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ గా కూడా పేరుగాంచింది. గత సంవత్సరం వరకూ ఇది పూర్తీ స్థాయి ఎండ్ టు ఎండ్ ఎం క్రిప్షన్ ను అందించింది. అంటే మీరు చేసే కాల్ లు కానీ, పంపే మెసేజ్ లూ, ఫోటో లు, వీడియో లు, ఫైల్ లు మరియు వాయిస్ మెసేజ్ లు ఇవన్నీగ్రూప్ చాట్ లతో సహా డిఫాల్ట్ గా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్ అయి ఉంటాయి. ఈ ఫిబ్రవరి 7 వ తేదీన సేఫర్ ఇంటర్ నెట్ డే ను 28 యూరోపియన్ దేశాలు సహా ప్రపంచ వ్యాప్తంగా సుంరు 120 దేశాలకు పైగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా వాట్స్ అప్ ను ఉపయోగించేతపుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం. ఇక్కడ వాట్స్ అప్ సెక్యూరిటీ మరియు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ గురించి ఒక సవివరవ్యాసం ఇవ్వబడింది.
ఫేస్ బుక్ యాజమాన్యం లో ఉన్న ఈ వాట్స్ అప్ తన ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కు ఒక బ్యాక్ డోర్ ను కలిగిఉన్నదని ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. దీనివలన యూజర్ లు పంపిన మెసేజ్ లు లీక్ అవ్వడమే గాక వాటిని వేరే వారు చదవడానికి వీలుగా ఈ బ్యాక్ డోర్ ఉందని గార్డియన్ ప్రకటించింది. అయితే వాట్స్ అప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తాము ఎవరికీ బ్యాక్ డోర్ పర్మిషన్ ఇవ్వలేదనీ ఈ విషయం లో తాము ఎవరితోనైనా పోరాడడానికి సిద్దమేనని ప్రకటించింది. అంతేగాక తన ఎన్ క్రిప్షన్ పాలసీ గురించి ఒక శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేసింది.
అసలు వాట్స్ అప్ ఎన్ క్రిప్షన్ అంటే ఏమిటి?
ఎండ్ టు ఎండ్ సెక్యూర్డ్ మెసేజ్ లు ఒక లాక్ ను కలిగిఉంటాయి. దీనివలన మెసేజ్ ను పంపిన వారు మరియు స్వీకరించిన వారు మాత్రమే వాటిని చూసే వీలు ఉంటుంది. అదనపు రక్షణ కోసం ఇది మీరు పంపే ప్రతీ మెసేజ్ కీ ఒక ప్రత్యేక లాక్ మరియు కీ కూడా ఇవ్వబడింది. ఇది ఇన్ బిల్ట్ గా లభిస్తుంది. దీనిని ఆన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్స్ అప్ యొక్క ఎండ్ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఓపెన్ విస్పర్ సిస్టమ్స్ యొక్క భాగస్వామ్యంతో డెవలప్ చేయబడింది.
సెక్యూరిటీ కోడ్ లను వెరిఫై చేయండి:-
ప్రతీ చాట్ కూడా తన స్వంత సెక్యూరిటీ కోడ్ ను కలిగిఉంటుంది. దీనివలన మీ సంభాషణ ఎండ్ టు ఎండ్ సెక్యూర్ గా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది.QR కోడ్ ను కాంటాక్ట్ పై ఉండే 60 అంకెల నెంబర్ తో స్కాన్ చేసి పోల్చడం ద్వారా దీనిని చేస్తారు. వ్హట్స్ అప్ సర్వర్ లు ప్రైవేటు కీ లను కలిగిఉండవు.
సెక్యూరిటీ నోటిఫికేషన్ లను టర్న్ ఆన్ చేయండి:-
సాధారణంగా మీ స్నేహితుల యొక్క సెక్యూరిటీ కోడ్ మారినపుడు కానీ వారు వాట్స్ అప్ యాప్ ను రీ ఇన్ స్టాల్ చేసుకున్నపుడు కానీ ఈ సెక్యూరిటీ నోటిఫికేషన్ లు మీకు తెలియజేస్తాయి. సెట్టింగ్ లు> ఎకౌంటు> సెక్యూరిటీ ఇలా చేయడం ద్వారా మీరు ఈ సెక్యూరిటీ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేసుకోవచ్చు.
స్పామ్ ను రిపోర్ట్ చేసి అనుమానంగా ఉన్న మెసేజ్ లను డిలీట్ చేయడం :-
గత నెలలో భారత ప్రధాని అందరి మొబైల్ లలో రూ 500-/ లు రీఛార్జి చేస్తున్నారని ఒక ఫేక్ మెసేజ్ షికారు చేసింది. ఇలాంటి మెసేజ్ లలు మీకు వచ్చినపుడు కానీ లేక మీకు వచ్చిన మెసేజ్ లపై మీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా వాటిని స్పామ్ గా గుర్తించి వెంటనే వాట్స్ అప్ కు రిపోర్ట్ చేయాలి. అ సెండర్ ను బ్లాక్ చేసి తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఆ మెసేజ్ లను డిలీట్ చేయండి
"
"