• తాజా వార్తలు

2021 నుంచి ఈ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. అందులో మీది ఉందా?

వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో దాదాపు లేవ‌నే చెప్పాలి. అంత‌గా ఈ మెసేజింగ్ యాప్ జ‌నాల్ని ఆక‌ట్టుకుంది. అయితే 2021 అంటే మ‌రో రెండు రోజుల త‌ర్వాత వాట్సాప్ కొన్ని ఫోన్ల‌లో ప‌నిచేయ‌దు. ఆ ఫోన్ల‌లో మీది ఉందా.. ఉంటే ఏం చేయాలో చూద్దాం రండి.

వీటిలో ప‌నిచేయ‌దు
* ఐ ఫోన్ 4 అంత‌కంటే ముందు వ‌చ్చిన ఐఫోన్ల‌లో 2021 నుంచి వాట్సాప్ ప‌ని చేయ‌దు.
* అలాగే మీరు శాంసంగ్ ఎస్‌2 వాడుతున్నా కూడా మ‌రో రెండు రోజుల్లో మీ వాట్సాప్ ప‌నిచేయ‌డం మానేస్తుంది.

వీటిలో అప్‌డేట్ చేసుకోవాల్సిందే 
ఐవోఎస్ 9 లేదా ఆ పైన ఓఎస్‌లున్న ఐఫోన్లు, ఆండ్రాయిడ్ 4.0.3 ఆపైన ఓఎస్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో కూడా ఇక నుంచి వాట్సాప్ ప‌ని చేయ‌దు. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన ఓఎస్‌ల‌కు అప్‌డేట్ చేసుకుంటే వాట్సాప్ ప‌ని చేస్తుంద‌ని కంపెనీలు చెబుతున్నాయి. ఒక‌వేళ మీ ఫోన్‌లో ఆ అప్‌డేట్స్ రాక‌పోతే మాత్రం మీరు వాట్సాప్‌ను ఆ ఫోన్‌లో ఇక వాడుకోలేరు. అయితే కొత్త ఫోన్ కొనుక్కోవడం లేదంటే వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా టెలిగ్రామ్ లాంటివి వాడుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. కాబ‌ట్టి పారా  హుషార్‌.

జన రంజకమైన వార్తలు