వాట్సాప్ తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ ఫీచర్లేంటో చూద్దాం రండి.
మిస్డ్ గ్రూప్ కాల్స్
వాట్సాప్‌లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ కొలీగ్స్ గ్రూప్ కాల్స్ చేస్తుంటారు కదా. అలా గ్రూప్ కాల్స్ చేసినప్పుడు మీకు కాల్ వచ్చినా మీరు ఏదో పనిలో ఉండి లిఫ్ట్ చేయలేకపోయారు. కానీ తర్వాత చూసుకుని కాల్‌లో యాడ్ అవుదామంటే కుదరదు. అఫీషియల్ కాల్స్ అయితే ఇది చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్ మిస్డ్ గ్రూప్ కాల్స్. ఈ ఫీచర్‌తో మీరు ఒకవేళ గ్రూప్ కాల్ వచ్చినప్పుడు అటెండ్ కాకపోయినా తర్వాత చూసి జాయిన్ అవ్వచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో బీటా యూజర్లకు ఈ మిస్డ్ గ్రూప్ కాల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అందరికీ వస్తుంది.
వాట్సాప్ పేస్ట్ మల్టిపుల్ ఇమేజెస్
వాట్సాప్‌లో ఒకేసారి 30 వరకు ఫోటోలు పంపవచ్చు. కానీ వాటిని ఒక్కోటి ఒక్కోసారి సెలెక్ట్ చేయాలి. కానీ వాట్సాప్ పేస్ట్ మల్టిపుల్ ఇమేజెస్ ఫీచర్ ద్వారా ఒకేసారి మల్టిపుల్ ఇమేజెస్‌ను, వీడియోలను సెలెక్ట్ చేసుకోవచ్చు.
Export బటన్ నొక్కి Copy చేస్తే చాలు . తర్వాత వాటిని ఒకేసారి సెండ్ చేయొచ్చు