నటాలీ సిల్వనోవిచ్.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో పని చేసే మహిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 లక్షల రూపాయలు గిఫ్టగా ఇచ్చింది. గూగుల్‌కు ఏ మాత్రం సంబంధంలేని ఫేస్‌బుక్ నుంచి ఆమెకు అంత పెద్ద గిఫ్ట్ ఎందుకొచ్చింది. తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ చదవండి
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో బగ్ గుర్తించింది
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ వాడుతున్నారు. దీనిలో ఓ పెద్ద లోపం ఉందని నటాలీ గుర్తించింది. ఈ లోపంతో హ్యాకర్లు మెసెంజర్ యాప్‌లో ఇద్దరి మధ్య జరిగే కాల్ సంభాషణలను వినే అవకాశం ఉందంట. ఈ విషయాన్ని నటాలీ అక్టోబర్‌లో గుర్తించి ఫేస్‌బుక్‌కు చెప్పింది. అయితే ఈ లోపం ఆండ్రాయిడ్ మెసేంజర్ యాప్‌లో మాత్రమే ఉందని ఆమో చెప్పింది. హ్యాకర్లు ఫేస్‌బుక్ యూజర్ల మీద నిఘా పెట్టడానికి ఈ లోపం సహాయపడుతుందని చెప్పడంతో ఫేస్‌బుక్ వెంటనే స్పందించింది. నటాలీకి 60 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 44 లక్షలు రూపాయలు బహుమతిగా ఇచ్చింది. అంతేకాదు మెసెంజర్ యాప్‌లో ఆ లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది.
గతంలోనూ చాలా చేసింది
మన యాప్స్‌లో బగ్స్ గుర్తించడం నటాలీకి ఇదే మొదటిసారి కాదు. గతంలో వాట్సాప్, ఐమెసేజెస్, విఛాట్, సిగ్నల్, రిలయన్స్ జియో ఛాట్ వంటి యాప్స్‌లోనూ లోపాల్ని గుర్తించి ప్రకటించింది. వాటిని సరిచేయడానికి ఆ కంపెనీలు చర్యలు తీసుకున్నాయి.