• తాజా వార్తలు

విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

యూట్యూబ్ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని విద్యార్థులకు స్ట్రీమింగ్ బేస్ సబ్ స్క్రైబర్లకు డిస్కౌంట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో మరియు వీడియో స్ట్రీమింగ్ విభాగాలకు ప్రత్యేకంగా రెండు స్ట్రీమింగ్ సేవలు ఇండియాలో iOS మరియు Android డివైస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో గుర్తింపు పొందిన కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దీని యాక్సిస్ పొందడం ద్వారా ఈ డిస్కౌంట్ ప్లాన్లను అందుకోవచ్చు. 

విద్యార్థులు YouTube మ్యూజిక్ సేవలను నెలకు కేవలం రూ.59 చెల్లించడం ద్వారా పొందవచ్చు. అలాగే YouTube ప్రీమియం వీడియో ప్రసార సేవలను నెలకు 79 రూపాయలు చెల్లించడం ద్వారా పొందవచ్చు. Android డివైస్ లలో YouTube మ్యూజిక్ మెంబర్ షిప్ నెలకు రూ.99 గా ఉంటుంది.మాములుగా యుట్యూబ్ ప్రీమియం సేవలు కావాలంటే నెలకు రూ.129 దాకా ఖర్చు అవుతుంది. IOSడివైస్ లలో ఇవే సేవలు వరుసగా రూ.129 మరియు రూ.169 ధరకు అందుబాటులో ఉన్నాయి.స్టూడెంట్ డిస్కౌంట్ ధర ఆండ్రాయిడ్ మరియు iOS డివైస్ లకు ఒకే విధంగా ఉంటాయి లేదా రెండింటి మధ్య కాస్త అటు ఇటుగా తేడా ఉండవచ్చు.

స్టూడెంట్ డిస్కౌంట్ ప్లాన్స్ వ్యక్తిగత సభ్యుల చందాలకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది. ఆరు మంది కుటుంబ సభ్యులు గల ప్లాన్స్ కోసం YouTube మ్యూజిక్ ఆండ్రాయిడ్స్ లో నెలకు రూ.149 మరియు iOS లో రూ. 199లుగా ఖర్చవుతుంది. యుట్యూబ్ ప్రీమియం ధర ఆండ్రాయిడ్ మరియు ios లో నెలకు వరుసగా రూ.189మరియు రూ.249గా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్,స్ఫోటిఫ్య్ మరియు ఆపిల్ మ్యూజిక్ వంటి వాటి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొనేందుకు గూగుల్ కు చెందిన యాజమాన్యం ఈ పోటీతత్వాన్ని ప్రవేశపెట్టింది. భారతీయ స్ట్రీమింగ్ పరిశ్రమ స్థిరమైన వేగంతో పెరుగుతూ వెళుతోంది.కాబట్టి యుట్యూబ్ వ్యూహాత్మక నియంత్రిత ధరలతో దేశంలో అభివృద్ధి చెందుతున్న యువతను మరియు వినియోగదారులను ఆకర్షణీయమైన ఆఫర్ల తో ఆకట్టుకోవాలని YouTube భావిస్తోంది. 
 

జన రంజకమైన వార్తలు