బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను టిక్ టిక్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కంపెనీ ప్రభుత్వాలతో చర్చలు సాగించనుందని తెలుస్తోంది. ఈ విషయం మీద బైట్ డ్యాన్స్ ప్రతినిధులు ఆయా శాఖల మంత్రులను , అలాగే ఏజెన్సీలను కలిసినట్లు సమాచారం.
ఇప్పటికే సోషల్ మీడియా యాప్ లు అయిన Google, Facebook, and Uberలలో పనిచేసిన వారిని టిక్ టాక్ లో నియమించుకునే విషయంలో దూకుడుగా ముుందుకెళ్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలతో సహకరించడం ద్వారా చైనా కంపెనీలు ఎదుర్కొంటున్న సాధారణ అపనమ్మకాన్ని తొలగించడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఓ నివేదిక తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాలతో కలిసి పనిచేయాలనుకుంటోంది. వీటిల్లో health, tourism వంటి విభాగాలు కూడా ఉన్నాయి.
జూన్ 21న యోగా దినోత్సవం సంధర్భంగా #YogaDay2019 పేరుతో టిక్‌టాక్ యూజర్లలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అది విజయవంతం కావడంతో ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటోంది. ఈ వారంలో కేరళ టూరిజంలో కూడా టిక్ టాక్ భాగమయింది. #TikTokTravel పేరుతో టూరిజం మీద క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తోంది.
గతేడాది Facebook కంపెనీ women and child development ministry సహకారంతో Digital Literacy Library కార్యక్రమాన్ని లాంచ్ చేసిన సంగతి విదితమే. ఇది మొత్తం ఆరు భాషల్లో ( Hindi, Bengali, Tamil, Telugu, Kannada and Malayalam ) లాంచ్ అయింది. అలాగే గూగుల్ కూడా Archaeological Survey of India సహకారంతో చారిత్రక కట్టడాల సందర్శన కార్యక్రమాన్ని, railway ministry సహయంతో ఫ్రీ వైఫై కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ట్విట్టర్ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయంతో అనేక రకాలైన క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ అవి ప్రజలతో కమ్యూనికేట్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు బైట్ డ్యాన్స్ కూడా ఇదే తరహాలో ముందకెళ్లనుంది.ఇండియాలో నెలకు 300 మిల్లియన్ మంది యూజర్లు టిక్ టాక్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. బైట్ డ్యాన్స్ కంపెనీ TikTok, Vigo Video, and Helo వంటి యాప్స్ ని ఇండియాలో రన్ చేస్తోంది. ఇప్పటికే దీని మీద 100 మిల్లియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. రానున్న సంవత్సరాల్లో దాదాసు 1 బిల్లియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ అలాగే music streaming serviceల మీద కూడా పనిచేస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి.