• తాజా వార్తలు

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ.. ఈ రూల్స్ అంగీక‌రించ‌క‌పోతే మీకు వాట్సాప్ క‌ట్

పొద్దున లేవ‌గానే మ‌న స్మార్ట్‌ఫోన్‌లో మొద‌టగా చూసేది వాట్సాప్‌నే. ఈ   యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా?  మీరు దాన్నియాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్ర‌వ‌రి 8 త‌ర్వాత మీ వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్‌ని అంగీకరించాలి. లేకపోతే మీ వాట్సప్ అకౌంట్ డిలిట్ చేసే అవకాశం ఉంది. మీరు వాట్సాప్ యాప్ వాడుకోవాలంటే కొత్త ప్రైవసీ రూల్స్‌ని అంగీకరించాల్సిందే.
ఫేస్‌బుక్‌తో షేరింగ్‌
వాట్సా‌ప్ త‌న నియమనిబంధనల్ని అప్‌డేట్ చేసింది. 2021 జనవరి 4న అప్‌డేట్ చేసిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీకి సంబంధించిన సమాచారం యూజర్లకు అందుతోంది. వాట్సప్ అప్‌డేట్ చేసిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ 2021 ఫిబ్రవరి 8న అమలులోకి రానుంది.  వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. సో మ‌న వాట్సాప్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేస్తుంది.  

వాట్సాప్ మీనుండి ఏ స‌మాచారం సేక‌రిస్తుందంటే.
* మీ ఫోన్ హార్డ్‌వేర్ 
* ఆపరేటింగ్ సిస్టమ్
*  బ్యాటరీ లెవెల్ 
* సిగ్నల్ స్ట్రెంత్ 
*  యాప్ వర్షన్ 
* బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ 
* మొబైల్ నెట్వర్క్ 
*  కనెక్షన్ ఇన్ఫర్మేషన్
* లాంగ్వేజ్ 
*  టైమ్ జోన్
*  ఐపీ అడ్రస్ లాంటి వివరాలు ఉంటాయి. 

రూల్స్ అంగీక‌రించ‌క‌పోతే వాట్సాప్ డిలీట్‌
వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించకుండా యూజ‌ర్లు వ‌దిలేసే పరిస్థితి లేదు. వాట్సాప్ యాప్ యూజ‌ర్లంతా  కొత్త ప్రైవసీ రూల్స్‌ను  ఫిబ్రవరి 8 లోగా అంగీకరించాల్సిందే. లేకపోతే అప్పట్నుంచి యాప్ ఓపెన్ కాదు. అకౌంట్ డిలిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంద‌ని వాట్సాప్ ప్ర‌క‌టించింది.

జన రంజకమైన వార్తలు