• తాజా వార్తలు

యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

అత్యంత తక్కువ కాలంలో పాపులర్ కావడానికి  యూట్యూబ్ అనేది చాలామందికి బెస్ట్ ఫ్లాట్ పాం.. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉంది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో అప్ డేట్ చేసి ఆదాయాన్ని పొందుతుంటారు చాలామంది. అయితే రూల్స్ తెలియకుండా యూట్యూబ్ లోకి దిగితే మీరు ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఉంది. అలా రూల్స్ ఫాల్  అవ్వకుండా కంటెంట్ అప్ లోడ్ చేసిన ఛానల్స్ చాలా వాటిని యూట్యూబ్ తొలగించింది. 

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు తన సైట్‌లో 1 లక్ష వీడియోలను తొలగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 17వేలకు పైగా చానల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సదరు వీడియోలను తొలగించామని యూట్యూబ్ తెలిపింది. ఎక్కువగా ఇతరుల మనోభావాలను కించ పరిచే విధంగా ఆ వీడియోలు ఉన్నాయని, అందుకనే వాటిని తొలగించామని గూగుల్ తెలిపింది.

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో మొత్తం 90 లక్షలకు పైగా వీడియోలను, 40 లక్షలకు పైగా యూట్యూబ్ అకౌంట్లను తొలగించామని సంస్థ తెలిపింది. వాటిలో చాలా వరకు స్పాం కేటగిరీకి చెందిన వీడియోలు ఉన్నాయని, అనేక వీడియోలు వీక్షకులను తప్పుదోవ పట్టించే స్కాం విభాగానికి చెందినవిగా కూడా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. అందుకనే వాటిలో చాలా వరకు వీడియోలను ఒక్కరు కూడా వీక్షించకముందే యూట్యూబ్ నుంచి తొలగించామని ఆ సంస్థ తెలియజేసింది. ఇకపై కూడా తమ పాలసీలను మరింత కఠినంగా అమలు చేస్తామని, యూట్యూబ్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసే వీడియోలను పరిశీలించేందుకు 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గూగుల్ తెలిపింది. కాబట్టి యూట్యూబ్ బిజినెస్ లోకి దిగాలనుకున్న వారు కొంచెం రూల్స్ తెలుసుకుని దిగితే మంచిది. 

జన రంజకమైన వార్తలు