రెండు రోజుల క్రితం అమెరికాలోని శాన్‌జోస్‌లో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఐ ఓఎస్11ను యాపిల్ లాంచ్ చేసింది. గత ఓఎస్‌ల్లో ఉన్న లోటుపాట్లను సాల్వ్ చేస్తూ కొత్త ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐ ఓఎస్11లో ఉన్న కొన్ని ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో కూడా లేవు. ఇది తమకు ప్లస్‌పాయింట్ అని యాపిల్ చెబుతోంది. ఆండ్రాయిడ్‌లో లేనివి ఐ ఓఎస్11లో ఏడు ఫీచర్లు ఉన్నాయి. అవేమిటో చూడండి.
1. స్పామ్ మెసేజ్ ఫిల్టర్
ఐ ఓఎస్11లోని కొత్త ఫీచర్లలో చాలా ముఖ్యమైనది ఇది. కొత్త ఓఎస్‌లోని మెసేజ్ యాప్ మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించుకుని స్పామ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేసేస్తుందని యాపిల్ ప్రకటించింది. కాబట్టి మనకు అక్కర్లేని, చెత్త యాడ్స్ మెసేజ్‌లు చూసే బాధ తప్పుతుంది.
2. నేటివ్ స్క్రీన్ రికార్డింగ్
ఐఓఎస్ 11 యూజర్లు తమ ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేసుకోవచ్చు. ఎక్స్‌టర్నల్ వాయిస్ ఇన్‌పుట్‌తో రికార్డ్ చేయడమే కాదు. జిఫ్‌లు కూడా తయారుచేయవచ్చు. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు స్క్రీన్ రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఆండ్రాయిడ్ ఫోన్లన్నింటికీ ఈ ఫీచర్ అందుబాటులో లేదు.
3.మెసేజ్ సింక్
కొత్త ఓఎస్‌లోని మెసేజ్ యాప్‌కు ఐక్లౌడ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ మెసేజ్‌లను సేమ్ యాపిల్ ఐడీ కలిగిన ఏ యాపిల్ డివైస్‌లో అయినా చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్‌లో ఈ ఫీచర్ లేదు.
4. మెసేజ్‌ల ద్వారానే మనీ సెండింగ్, రిసీవింగ్
మెసేజ్ యాప్ ద్వారానే మనీ సెండ్ చేయడం లేదా రిసీవ్ చేసుకునే ఆప్షన్ కొత్త ఓఎస్‌లో ఉంది. టెక్స్ట్ మెసేజ్ తోనే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. రిసీవ్ చేసుకున్న డబ్బును ఏదైనా అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలన్నా ఈ మెసేజ్ యాప్ ద్వారానే చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఆండ్రాయిడ్‌లో ఇలాంటి ఫెసిలిటీ లేదు.
5. రియల్‌టైంలోనే సిరి లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్
యాపిల్ వాయిస్ బేస్డ్ అసిస్టెంట్ సిరిని ఈ కొత్త ఓఎస్‌లో ఇంప్రూవ్ చేశారు. రియల్ టైంలోనే మనక తెలియని లాంగ్వేజ్ అయితే రియల్‌టైంలోనే ట్రాన్స్‌లేట్ చేసే సౌలభ్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఇంగ్లీష్‌ను చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లోకి అనువదిస్తుంది.
6. సెటప్ ఇక ఈజీ
మీ కొత్త ఓఎస్‌తో కూడిన యాపిల్ డివైస్‌ను పాత యాపిల్ డివైస్‌కు దగ్గర్లో పెడితే చాలు సేమ్ సెటప్ అందులో కూడా వస్తుంది. పర్సనల్ సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్‌వంటివన్నీ పాతదానిలో కూడా వెంటనే మారిపోయేలా ఈ ఫీచర్‌ను డిజైన్ చేసినట్లు యాపిల్ చెబుతోంది.
7. డ్రాగ్ అండ్ డ్రాప్
ఐఓఎస్11లో కొత్తగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇమేజ్‌లు,టెక్స్ట్, యూఆర్ ఎల్స్ వంటివి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.