• తాజా వార్తలు

జీమెయిల్ అకౌంట్ ఉందా.. అయితే గూగుల్ మీట్ యాప్‌తో నేరుగా వీడియో కాల్స్ చేసుకోండి

లాక్‌డౌన్‌తో ఇప్పుడంతా వీడియో కాన్ఫ‌రెన్సింగ్ సొల్యూష‌న్స్‌దే హ‌వా. జూమ్ యాప్ సూప‌ర్ స‌క్సెస్ అయినా, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ రూమ్స్ తీసుకొచ్చినా అదంతా వీడియో కాల్స్‌, కాన్ఫ‌రెన్స్ ఫ్లాట్‌ఫామ్స్‌కి పెరిగిన డిమాండ్ వ‌ల్లే. ఇప్పుడు ఈ కోవ‌లో గూగుల్ కూడా వ‌చ్చి చేరింది. త‌న  గూగుల్ ప్రీమియం మీట్ యాప్‌ను వినియోగదారులందరికీ ఉచితంగా అందిస్తోంది.  మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు నేరుగా వీడియో కాల్ చేసుకునేందుకు గూగుల్ మీట్ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  

సులువుగా వాడుకోవ‌చ్చు
 గూగుల్ మీట్ ఇతర వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాంల కంటే సౌకర్యవంతంగా ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. దీన్ని మీరు జీమెయిల్ అకౌంట్‌తోనే వాడుకోవ‌చ్చు. కాబ‌ట్టి కొత్త‌గా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డం, దాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన ప‌నిలేదు. షెడ్యూలింగ్‌, షేరింగ్‌ స్క్రీన్‌ షాట్స్‌, రియల్‌ టైం క్యాప్షన్స్ వంటి లేటెస్ట్ ఆప్ష‌న్లు కూడా గూగుల్ మీట్‌లో ఉన్నాయి.

గూగుల్‌ మీట్‌ వీడియో కాల్‌ను జీమెయిల్‌లో ఎలా వాడుకోవాలి? 
* మీ జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి. 

* డ్రాప్ట్‌ కింద గూగుల్‌ మీట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

* స్టార్ట్‌‌ ఏ మీటింగ్‌, జాయిన్‌ ఏ మీటింగ్ అనే రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.

* మీరే కాల్ స్టార్ట్ చేయాలంటే.. స్టార్ట్‌ మీటింగ్‌ను క్లిక్ చేయాలి. 

*  ఇప్పుడు మీ ల్యాప్‌ట్యాప్‌కెమెరా లేదా మైక్రోఫోన్స్ ప‌ర్మిష‌న్ అడుగుతుంది. 

* కెమెరా యాక్సెస్‌ను క్లిక్ చేయండి. వెంట‌నే మీకు కెమెరా సెట్ అవుతుంది. మీటింగ్‌ రెడీ అని మెసేజ్ కూడా వస్తుంది. 

* మీరు వేరే కాల్‌లో జాయిన్ అవాల‌నుకుంటున్నారా లేదా మీరే కాల్ డిస్‌ప్లే చేయాల‌నుకుంటున్నారా 
అడుగుతుంది. 

* జాయిన్‌ క్లిక్‌ చేస్తే వీడియో చాట్‌ కోసం లింక్‌తో కూడిన ఒక పాప్ అప్ విండో ఓపెన్‌ అవుతుంది. 

* ఇప్పుడు ఈ లింక్‌ను మీరు ఎవరితో మాట్లాలనుకుంటున్నారో వారికి  సెండ్ చేయాలి. వారు దాన్ని క్లిక్ చేసి లేదా ఆ మీటింగ్ ఐడీని ఎంట‌ర్ చేస్తే మీతోపాటు కాల్‌లో జాయిన్ అవుతారు. 


* లేదా మీరు వేరేవారి మీటింగ్‌లో జాయిన్ కావాల‌నుకుంటే వారు పంపిన లింక్‌ను క్లిక్ చేయాలి. లేదా ఆ మీటింగ్ ఐడీని ఎంట‌ర్ చేస్తే వారితో పాటు మీరు కాల్‌లో జాయిన్ అవుతారు.  

జన రంజకమైన వార్తలు