ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్రస్తుతం బీటా వెర్షన్ దశలోనే ఉంది. ఈ బీటా వెర్షన్ అంటే ట్రయల్ వెర్షన్ అప్‌డేట్‌ను గూగుల్ తన సొంత ఫోన్లయిన పిక్సెల్ ఫోన్లకే అందించింది. అయితే ఈ నెలలో నాన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా చాలావాటికి ఈ బీటా వెర్షన్ అప్‌డేట్ రాబోతోంది. ఇందులో ఒప్పో, రియల్‌మీ, షియోమి, పోకో ఇలా చాలా కంపెనీల ఫోన్లు ఉంటాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.
ఆండ్రాయిడ్ 11 బీటా వెర్షన్ రానున్న ఆండ్రాయిడ్ ఫోన్ల లిస్ట్ ఇదీ
* వన్‌ప్లస్ 8
* వన్‌ప్లస్ 8 ప్రో
* ఒప్పో ఫైండ్ ఎక్స్2
* ఐక్యూ 3
*వివో నెక్స్ 3ఎస్ 5జీ
* ఎంఐ 10
* ఎంఐ 10 ప్రో
* పోకో ఎఫ్2 ప్రో
* రియల్‌మీ ఎక్స్ 50 ప్రో