• తాజా వార్తలు

ఐవోఎస్ 14లో కొత్తగా వ‌చ్చిన ఈ 5 ఫీచ‌ర్లు చూశారా?

యాపిల్ త‌న ఐఫోన్‌, ఐప్యాడ్‌ల‌కు కొత్త ఓఎస్‌ను తీసుకొచ్చింది. ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఐవోఎస్‌14 పేరుతో దీన్ని లాంచ్  చేసింది. ఈ కొత్త ఓఎస్‌తో మీ ఐఫోన్‌లో వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్లు ఇవే.

1.కొత్త హోం స్క్రీన్‌
ఐవోఎస్‌లో యాపిల్ త‌న డివైస్‌ల హోం స్క్రీన్‌రూపురేఖ‌ల్ని పూర్తిగా మార్చేసింది. మీ యాప్స్‌ను ఇక గ్రూప్‌లుగా పెట్టుకోవ‌చ్చు. ఇంట‌ర్నెట్‌, ఎంట‌ర్‌టెయిన్‌మెంట్‌, ఈకామ‌ర్స్ ఇలా యాప్స్‌ను గ్రూప్‌లుగా పెట్టుకుని ఈజీగా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. 

2.క‌స్ట‌మైజ్డ్ విడ్జెట్స్‌
ఇప్ప‌టివ‌ర‌కు యాపిల్ వాచ్‌లో ఉన్న విడ్జెట్స్‌ను ఐఫోన్ హోం స్క్రీన్‌లోకి కూడా తీసుకొచ్చింది కొత్త ఓఎస్‌. యూజ‌ర్లు విడ్జెట్స్‌ను ఎక్క‌డి నుంచైనా హోం స్క్రీన్ మీద‌కి డ్రాగ్  చేసుకోవ‌చ్చు. వీటిని స్వైప్ చేసి అందులో ఉన్న కంటెంట్ ఏమిటో ఈజీగా చూడొచ్చు. 

3.పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ మోడ్‌
ఇక హోం స్క్రీన్‌లో పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ మోడ్‌ను ఐవోఎస్ 14 స‌పోర్ట్ చేస్తుంది. అంటే మ‌ల్టీ టాస్కింగ్ చేస్తూనే వీడియోలు  చూడొచ్చు. అలాగే వీడియోల‌ను కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేసు్కోవ‌చ్చు. వీడియోల‌ను ఫోన్ సెంట‌ర్ లేదా ఎడ్జ్ ఎక్క‌డికైనా మూవ్  చేసుకోవ‌చ్చు.  

4.మెసేజింగ్‌లో కొత్త ఫీచ‌ర్లు
మెసేజింగ్‌లోనూ కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చాయి. మాస్క్‌తో కూడిన ఎమోజీల‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు. మెమోజీలు కూడా కొత్త హెయిర్‌స్టైల్స్‌, హెడ్‌వేర్‌ల‌తో వ‌చ్చాయి. క‌‌న్వ‌ర్జేష‌న్స్‌ను పిన్ చేసుకోవ‌చ్చు. అంటే మ‌నం రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉండే వ్య‌క్తులతో మెసేజ్‌ల‌ను టాప్‌లో పెట్టుకోవ‌చ్చు. 

5.కొత్త లుక్‌లో సిరి
యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరి కూడా కొత్త రూపంలో మ‌న ముందుకు వచ్చింది. కొత్త సిరి పెద్ద‌, క‌ల‌ర్‌ఫుల్ ఐకాన్‌తో వ‌చ్చింది. అలాగే సిరి ఇప్పుడు స్క్రీన్ అంతా ఆక్ర‌మించ‌దు. ఫోన్ టాప్‌లో నోటిపికేష‌న్ విండో ద‌గ్గ‌ర మాత్ర‌మే డిస్‌ప్లే అవుతుంది.  అంటే మ‌ల్టీ టాస్కింగ్ చేస్తూనే సిరిని వాడుకునే సౌక‌ర్యం క‌లిగింది.  

జన రంజకమైన వార్తలు