పీసీలో ఏదో డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు.. లేదా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేసుకుంటున్నారు. సడెన్ గా పవర్ ఆఫ్ అయింది. లేదా మీకు ఆఫీస్‌కు టైం అయిపోయింది. ఆ ప్రోగ్రాంను మీ ఫోన్‌లో పూర్తి చేసుకోగలిగితే? స‌్మార్ట్‌ఫోన్‌లో ఏదో సగం పూర్తి చేశారు... బ్యాటరీ అయిపోయింది. ఆ ఫైల్‌ను పీసీలో యాక్సెస్ చేసి కంటిన్యూ చేయగలిగితే? ఇలాంటి కంటిన్యుటీ ఫీచర్ యాపిల్ డివైజస్‌లో ఉంటుంది. దీన్ని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. విండోస్ 10లో ఈ ఫీచర్ వస్తుంది. ఐవోఎస్ లేదా ఆండ్రాయిడ్‌లో థర్డ్ పార్టీ యాప్‌గా దీన్ని తీసుకోవాలి.
కోర్టానా సాయంతో..
యాపిల్ డివైజస్‌లో ఉండే ఈ కంటిన్యుటీ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ విండోస్ 10లో తీసుకురాబోతుంది. విండోస్ 10లో వర్చ్యువల్ అసిస్టెంట్ ఇన్‌బిల్ట్ గా ఉంటుంది. కోర్టానా సాయంతో ఈ కంటిన్యుటీ ఫీచర్‌ను వాడుకునేందుకు ఆండ్రాయిడ్, ఐవోస్‌ల్లో థర్డ్ పార్టీ అందుబాటులో ఉంటుంది. దీన్నిఉపయోగించి విండోస్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో వేటిలో అయినా సరే ఒకచోట ఆపేసిన ఫైల్ , డాక్యుమెంట్ ఏదైనా రెండో డివైస్‌లో యాక్సెస్ చేసి తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చు.
పికప్ వేర్ ఐ లెఫ్ట్ ఆఫ్
పికప్ వేర్ ఐ లెఫ్ట్ ఆఫ్ (పీడబ్ల్యూఐఎల్‌వో) అనే ఈ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ యాప్స్ సపోర్ట్ చేస్తాయి. మీరు విండోస్ 10 పీసీలో ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్, డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. మీరు దీన్ని ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌ల్లో యాక్సెస్ చేసి కంటిన్యూ చేయాలనుకుంటున్నారో లేదో కొర్టానా తెలుసుకుని యాప్‌కు కనెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ యాప్ మీరు తీసుకోకుంటే డౌన్ లోడ్ చేసుకోమని చెబుతుంది.