ఐఫోన్, ఐ పాడ్ యూజర్లకు యాపిల్ కొత్త ఐఓఎస్ ను అందుబాటులోకి తెచ్చింది. iOS 11 పేరుతో వచ్చిన ఈ కొత్త ఓఎస్‌తో ఐ ఫోన్ ఆండ్రాయిడ్ కంటే చాలా ముందుంటుందని అంచనా. అలా ఆండ్రాయిడ్ లేని, ఐ ఫోన్‌లో ఉన్న ఏడు కీలక ఫీచర్ల గురించి తెలుసుకోండి.
స్పామ్ మెసేజ్ ఫిల్టర్
ఐఓఎస్ 11లో వచ్చిన కొత్త ఫీచర్లలో కీలకమైన ఫీచర్. మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో యాపిల్ మెసేజ్ యాప్.. స్పామ్ గా గుర్తించిన మెసేజ్‌లను ఆటోమేటిగ్గా ఫిల్టర్ చేసేస్తుంది.
నేటివ్ స్క్రీన్ రికార్డింగ్
మీ ఫోన్ నేటివ్ స్క్రీన్‌ను ఎక్స్‌టర్నల్ వాయిస్ అవుట్‌పుట్ తో రికార్డ్ చేయడం ఈ ఫీచర్ స్పెషాలిటీ. ఈ ఫీచర్‌ను ఉపయోగించి జిఫ్‌లు కూడా క్రియేట్ చేయొచ్చు. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ ఉన్నప్పటికీ మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటికీ రాలేదు.
మెసేజ్‌స్ సింక్
ఐవోఎస్ 11లోని అప్‌డేటెడ్ మెసేజ్ యాప్ ఐ క్లౌడ్ సపోర్ట్ కలిగి ఉంది. అందువల్ల మీరు మీ యాపిల్ డివైస్‌లు అన్నింటితోనూ మెసేజ్‌లను సింక్ చేసుకోవచ్చు. మీ యాపిల్ ఐడీతో కనెక్ట్ అయి ఏ డివైస్‌లో అయినా మెసేజ్‌లు చూసుకోవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్‌లో ఈ ఫీచర్ ఇంకా రాలేదు.
మెసేజ్‌తో మనీ సెండింగ్, రిసీవింగ్
మెసేజ్ యాప్ ద్వారా మనీ సెండింగ్, రిసీవింగ్ చేసుకోగలగడం ఐవోఎస్ 11లో వచ్చిన మరో ఆసక్తికరమైన ఫీచర్. టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. బ్యాంక్ అకౌంట్‌కు మనీ రిసీవ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
సిరి లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ ఇన్ రియల్ టైమ్
ఐవోఎస్ 11 వెర్షన్‌లో యాపిల్ వాయిస్ బేస్డ్ అసిస్టెంట్ సిరిని కూడా ఇంప్రూవ్ చేశారు. సిరి ఇప్పడు రియల్ టైం కన్‌వర్సేషన్‌లోనే ఇంగ్లీష్ నుంచి చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిషఖ భాషలను ట్రాన్స్‌లేట్ చేస్తుంది.
ఈజీ-పీజీ
కొత్త ఐ ఫోన్ లేదా ఐ పాడ్ కొంటే దాన్ని పాత యాపిల్ ప్రొడక్ట్ ( ఫోన్, ఐప్యాడ్, మాక్)లకు దగ్గరగా పెడితే చాలు మీ పాత డివైస్‌లో ఉన్న పర్సనల్ సెట్టింగ్స్ , ప్రిఫరెన్సెస్, ఐక్లౌడ్ కీచెయిన్ పాస్‌వర్డ్‌లు.. సురక్షితంగా కొత్త యాపిల్ డివైస్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి.. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇది easy-peasy ఫీచర్ .
డ్రాగ్ అండ్ డ్రాప్ సపోర్ట్
కొత్త ఐవోఎస్ వెర్షన్‌లో కంటెంట్ ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసకునే ఫెసిలిటీ ఉంది. ఇమేజెస్, టెక్స్ట్, యూఆర్ ఎల్స్‌ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఐప్యాడ్‌ల్లో ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది.