కొవిడ్-19 (కరోనా) అనే పేరు వినగానే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. కనీవినీ ఎరగని రీతిలో ఓ వైరస్ మానవ జాతి మొత్తాన్ని వణికిస్తోంది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు.. రోజుల తరబడి లాక్‌డౌన్‌లు.. ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సాధారణ జలుబు, జ్వరం వచ్చినా కూడా అవి కరోనా లక్షణాలేమో అని జనం వణికిపోతున్నారు. అయితే మీది మామూలు జలుబు, జ్వరమో లేకపోతే అవి కరోనా లక్షణాలు కనిపెట్టే టూల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాని పేరు క్యూరో. అది ఎలా పని చేస్తుందో చూద్దాం.
ఏఐ టూల్
క్యూరో అనేది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పని చేసే ఓ టూల్. మెడియస్ హెల్త్ అనే సిడ్నీ బేస్డ్ హెల్త్ స్టార్టప్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ టూల్‌ను తయారుచేసింది. ఇది మీకు కరోనా రిస్క్ ఎంతవరకు ఉందో అంచనా వేస్తుంది.
ఎలా పని చేస్తుంది?
* బ్రౌజర్‌లో Quro అని లేదా https://covid-check.mediushealth.org/#/ టైప్ చేయండి.
* వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. హోంపేజీలో కుడివైపు పైన లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్, హిందీల్లో మీకు కావాల్సినది సెలెక్ట్ చేసుకోవచ్చు.
* లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ బటన్ నొక్కితే ఒకదాని తర్వాత ఒకటి కొన్ని ప్రశ్నలు వస్తాయి.
* మీ ఏజ్, జెండర్, ఏ దేశం, మీ ఇంటి పిన్ కోడ్ ఎంత? మీరు పని చేస్తున్నారా? అయితే మీ ఆఫీస్ పిన్‌కోడ్ ఎంత? మీరు రోజూ ఎలా ప్రయాణిస్తారు? వయ క్తిగత వాహనంలోనా? పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళతారా? మీ జాబ్ ఏమిటి? కరోనా రోగులతో టచ్‌లో ఉండే హెల్త్, పోలీస్‌లాంటి ఫ్రంట్ లైన్ జాబ్స్ చేస్తున్నారా లేదా వేరే ఏదైనా? మీకు జలుబు, జ్వరం, గొంతునొప్పి లాంటి లక్షణాలున్నాయా? ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతుంది.
* వాటికి మీరు ఎంటర్ చేసే ఆన్సర్లను బట్టి మీరు కరోనా రిస్క్ ఎంతవరకు ఉందో అసెస్ చేసి చెబుతుంది.
* రిస్క్‌కు తగ్గట్లు సలహాలిస్తుంది.
* మీ మెయిల్ ఐడీ సబ్మిట్ చేస్తే కరోనా అప్‌డేట్స్‌ను ఇస్తుంది.
75 వేల మంది చూసుకున్నారు
మెడియస్ హెల్త్‌ను ఇండియన్ అయిన అభీ భాటియా రన్ చేస్తున్నారు. మార్చి 14న ఇండియా, ఆస్ట్రేలియాల్లో ఈ టూల్‌ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు దీని ద్వారా 75 వేల మంది తమకు కరోనా ఉందో లేదో అని అసెస్‌మెంట్ చేసుకున్నారు.
9%కే హై రిస్క్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థలు ఇచ్చే సమాచారంతో ఈ టూల్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఇండియాలో ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంది అభీ భాటియా చెబుతున్నారు. తాము అసెస్ చేసిన కేసుల్లో దాదాపు 70 శాతం మందికి లోరిస్క్ అనే రిజల్ట్ వచ్చిందన్నారు. అదే 22 శాతం మంది మాత్రం రిస్క్‌కు అవకాశం ఉన్నవారని, మిగిలిన 9 శాతం మంది మాత్రమే హైరిస్క్ జోన్‌లో ఉన్నారని చెప్పారు.