• తాజా వార్తలు

మీకు ఏ మాత్రం తెలియ‌ని  యాప్స్‌,  సాఫ్ట్‌వేర్స్‌ మీ కోసం

టెక్నాల‌జీ రాకెట్ స్పీడ్‌తో డెవ‌ల‌ప్ అవుతోంది. రోజూ కొన్ని వంద‌ల ప్రొడ‌క్ట్స్ లాంచ్ అవుతున్నాయి. కానీ వాటిలో మన‌కు అవ‌స‌ర‌మైన‌వి ఎన్ని ఉన్నాయో తెలియ‌దు. ఎందుకంటే టెక్నాల‌జీ అవ‌స‌రం ఒక్కొక్క‌రికి ఒక్కోలా  ఉంటుంది. లేటెస్ట్‌గా రిలీజియ‌ని కొన్ని యాప్స్‌, గ్యాడ్జెట్స్‌, సాఫ్ట్‌వేర్స్  స‌మాచారం ఇదిగో.  
1.గిట్ కాయిన్ GitCoin 
సాఫ్ట్ వేర్ ఎకోసిస్ట‌మ్‌లో ఓపెన్ సోర్స్‌ది చాలా కీ రోల్‌.  అయితే క్లోజ్డ్ సాఫ్ట్‌వేర్‌కు వ‌చ్చిన‌ట్లు వీటికి డ‌బ్బులు రావు. అందుకే డెవ‌ల‌ప‌ర్స్ ఓపెన్ సోర్స్‌లో త‌మ సాఫ్ట్‌వేర్‌ల‌ను పెట్ట‌రు. దీనికి ప‌రిష్కారంగా గిట్ కాయిన్ వ‌చ్చింది. ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల‌కు మీరు కంట్రిబ్యూట్ చేస్తే మీకు కొంత పే చేయ‌డం ఈ కంపెనీ ఉద్దేశం. మీ కంట్రిబ్యూష‌న్ యాక్సెప్ట్ అయితే మీకు క్రిప్టో క‌రెన్సీ (బిట్ కాయిన్స్‌) రూపంలో మ‌నీ వ‌స్తుంది. ఈ మ‌ధ్య‌నే లాంచ్ అయింది.  

2.రిమోట్ ఏజ్ (Remote Age)
టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అవుతున్న కొద్దీ వ‌ర్క్ చేయ‌డానికి ఆఫీస్‌కే వెళ్లాల‌న్న రూల్ పోతుంది. మీకు న‌చ్చిన‌చోట నుంచి ప‌ని చేసుకునే సౌక‌ర్యం ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇప్ప‌టికే వ‌ర్క్ ఫ్రం హోంను ఆఫ‌ర్ చేస్తున్నాయి. దీన్ని మ‌రింత డెవ‌ల‌ప్ చేసేందుకు రిమోట్ ఏజ్ పేరిట కొత్త సాఫ్ట్‌వేర్ వ‌చ్చేసింది. దీని ద్వారా మీరు ప్ర‌పంచంలో ఏ మూల నుంచైనా మీ కంపెనీ చెప్పిన‌ట్లు సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, డిజైనింగ్ వంటివ‌న్నీ చేసేయొచ్చు.  కంపెనీల‌కు మెయింట‌నెన్స్ భారం కాకుండా, ఎంప్లాయిస్‌కు ఆఫీస్‌కు వెళ్ల‌కుండా ప‌ని ముగించేసుకోవ‌డానికి ఇది మంచి ఆప్ష‌న్‌.  

3.ఫాస్ట్ సీఎల్ ఐ (Fast-CLI)
హ‌డావుడిగా ఆన్‌లైన్‌లో ఏదో ప‌ని చేసుకుంటున్న‌ప్పుడు స‌డెన్‌గా నెట్‌వ‌ర్క్ స్లో అయిపోతే చిర్రెత్తుకొస్తుందిగా.. వెంట‌నే  Ookla లాంటి స్పీడ్ టెస్ట్ వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసి స్పీడెంత వ‌స్తుందో చూస్తాం. అయితే ఇది చాలా టైం తీసుకుంటుంది. మీకు టైం వేస్ట్ అవుతోంది. అంతేకాదు మీ నెట్వ‌ర్క్ స్పీడ్ మ‌రీ స్లోగా ఉంటే స్పీడ్ టెస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ కాక‌పోయినా ఆశ్చర్యం లేదు.  ఇలాంటి సిట్యుయేష‌న్స్‌లో బాగా ఉప‌యోగ‌ప‌డే క‌మాండ్ లైన్ యుటిలిటీ.. ఫాస్ట్ సీఎల్ ఐ. మీరు ప‌ని ప‌క్క‌న‌పెట్టి మ‌రో వెబ్‌సైట్ ఓపెన్ చేయ‌క్క‌ర్లేకుండా వ‌ర్క్ విండో నుంచే నేరుగా నెట్‌వ‌ర్క్ స్పీడ్‌ను టెస్ట్ చేయొచ్చు.  
4. ఏఆర్ సోలో బాస్కెట్ బాల్ (AR Solo Basketball) 
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌) టెక్నాల‌జీ వ‌చ్చాక ఆన్‌లైన్ గేమ్స్ మ‌రింత ఫ‌న్ ఇస్తున్నాయి. యాపిల్ కూడా తన డెవ‌ల‌ప్‌మెంట్ కాన్ఫ‌రెన్స్‌లో ఏఆర్ కిట్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఐవోఎస్ 11లో లేటెస్ట్‌గా వ‌చ్చిన ఏఆర్ సోలో బాస్కెట్‌బాల్ గేమ్ యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.  ఈ వర్చువ‌ల్ బాస్కెట్‌బాల్ గేమ్‌ను సింగిల్‌గా ఆడుకోవ‌చ్చు.  ఈ యాప్‌తో బాస్కెట్‌బాల్ గేమ్‌లో కొత్త  అనుభూతి ఖాయమంటోంది యాపిల్‌.   
5. సినోనిమ్‌ఫుల్ (Synonymful) 
ప్రొఫెష‌న‌ల్ ఈ మెయిల్ రాస్తున్నారు.. లేదా జాబ్‌కు అప్లికేష‌న్ పెట్టేట‌ప్పుడు క‌వ‌రింగ్ లెట‌ర్ రాస్తున్నారు. కానీ మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతంంత‌మాత్ర‌మే అయితే మీకున్న టాలెంట్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే స్థాయిలో ప‌దాలు రావు. ఇలాంటి టైంలో హెల్ప్ చేయ‌డానికి  సినోనిమ్‌ఫుల్ వ‌చ్చేసింది. మీ డాక్యుమెంట్లో ఉన్న‌వ‌ర్డ్స్ కంటే బెట‌ర్ సినోనిమ్స్‌ను ఐడెంటిఫై చేసి మీకు స‌జెస్ట్ చేస్తుంది. సో మీ లెట‌ర్ లేదా మెయిల్ మ‌రింత క్వాలిటీగా త‌యార‌వుతుంది.  మ్యాక్ ఓఎస్‌, విండోస్, లిన‌క్స్‌ల్లో కూడా స్టాండ్ ఎలోన్ అప్లికేష‌న్‌గా ల‌భిస్తుంది.  


 

జన రంజకమైన వార్తలు