మీరు ఓ పదం చెప్పగానే టైప్ చేసే సాఫ్ట్‌వేర్ వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా.. అయితే మైక్రోసాఫ్ట్ మీ కోసం ఇలాంటి యాప్‌నే తీసుకొచ్చింది. మీరు డిక్టేట్ చేసే మాటలను వెంటనే టెక్స్ట్‌గా కన్వర్ట్ చేసే ఈ కొత్త ఫీచర్ పేరు డిక్టేట్. ఇప్పటికే Cortana ఇదే పని చేస్తున్నప్పటికీ డిక్టేట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజర్ల కోసం డిజైన్ చేయబడింది.
ఇవీ స్పెషాలిటీస్
మైక్రోసాఫ్ట్ డిక్టేట్ యాప్ డిక్టేట్‌లో ప్రత్యేకత ఏమిటంటే కేవలం మాటల్ని టెక్స్ట్‌గా కన్వర్ట్ చేయడమే కాదు ఆ నోట్‌కు సంబంధించిన మిగిలిన యాక్షన్స్‌ను కూడా నోటిమాటతోనే చేసేస్తుంది. పుల్‌స్టాప్ అంటే పుల్‌స్టాప్, కామా, ఎక్స్ క్లమేటరీ సింబల్ ఇలా ఏది చెబితే దాన్ని టెక్స్ట్‌తోపాటు ఇన్‌సర్ట్ చేసేస్తుంది. next line అనగానే కర్సర్ ఆటోమేటిగ్గా తర్వాత లైన్‌కు వెళ్లిపోతుంది. stop dictation అనగానే డిక్టేట్ ఆఫ్ అయిపోతుంది. 1500 మంది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయిస్ పాల్గొన్న మైక్రోసాఫ్ట్ హ్యాకథాన్‌లో ఈ Dictateను డిజైన్ చేశారు.
* ప్రస్తుతం డిక్టేట్ 20 లాంగ్వేజ్‌లను సపోర్ట్ చేస్తుంది.
* టెక్స్ట్ ను రియల్‌టైంలో 60 భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయగలదు.
ఎలా పని చేస్తుంది?
స్పీచ్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో డిక్టేట్ పని చేస్తుంది. బింగ్ స్పీచ్ ఏపీఐ, మైక్రోసాప్ట్ ట్రాన్స్‌లేటర్లను కూడా వినియోగించుకుంటుంది. ఈ యాప్ ప్రస్తుతం ఫ్రీగా లభిస్తుంది. 32 లేదా 64 బిట్ విండోస్ 8.1, ఆ పైన వెర్షన్ ఉన్న సిస్టమ్స్‌కు డిక్టేట్ పని చేస్తుంది.