పెద్ద ఫైల్స్‌ను ఎలాంటి బ్రౌజర్ నుంచి అయినా షేర్ చేయడానికి ఫైర్‌ఫాక్స్ సెండ్ అనే కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీసు ద్వారా మీరు 1జీబీ వరకు ఫైల్‌ను షేర్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఫైల్ షేర్ చేస్తే ముందు అది ఫైర్‌ఫాక్స్ సెండ్ సర్వర్‌లోకి ఎన్‌క్రిప్టెడ్ ఫాంలో అప్‌లోడ్ అవుతుంది. యూనిక్ షేరింగ్ లింక్‌ను జనరేట్ చేస్తుంది. ఈ లింక్‌ను ఎవరైనా ఓపెన్ చేస్తే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడింగ్ కంటే ముందే సెండ్ సర్వీస్.. మీ ఫైల్‌ను ఆటేమేటిగ్గా డీక్రిప్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఫైల్‌ను ఒరిజినల్ కంటెంట్‌తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీ పైల్ సెక్యూర్డ్‌గా సెండ్ అవుతుంది.
ఇవీ ప్రత్యేకతలు
* సెండ్ సర్వీస్‌ను వాడుకోవాలంటే దాన్ని యాడ్ ఆన్‌లా ఇన్‌స్టాల్ చేసుకోవక్కర్లేదు.
* దీనికోసం అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన పని కూడా లేదు.
* క్రోమ్, ఫైర్‌ఫాక్స్, ఒపెరా.. ఇలా ఎలాంటి మోడ్రన్ బ్రౌజర్‌లో అయినా డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు.
సెండ్ సర్వీస్ ద్వారా లార్జ్ ఫైల్స్‌ను సెక్యూర్డ్‌గా షేర్ చేసుకోవడం ఎలా?
* షేర్ చేయాలనుకున్న కంటెంట్‌ను ఈ సర్వీస్ హోం పేజ్‌లో అప్‌లోడ్ చేయాలి. లేదా పీసీ నుంచి ఫైల్‌ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు.
* ఫైల్ సర్వర్‌లోకి అప్‌లోడ్ కాగానే ఎన్‌క్రిప్టెడ్ ఫాంలో స్టోర్ అవుతుంది. ఆ ఫైల్‌కు సంబంధించి షేరింగ్ లింక్ జనరేట్ అవుతుంది.
* ఎవరికి ఫైల్ షేర్ చేయాలో వారికి ఈ షేరింగ్ లింక్‌ను పంపిస్తే చాలు. వాళ్లు లింక్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ బటన్ నొక్కితే ఫైల్ డ్రీకిప్ట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని పీసీలో డౌన్ లోడ్ / సేవ్ చేసుకోవచ్చు.
లిమిటేషన్స్ ఉన్నాయి..
* ఒకసారి ఒక ఫైల్ మాత్రమే అప్‌లోడ్ చేసి షేర్ చేయగలరు.
* షేర్ అయిన ఫైల్‌ను ఒక్కసారి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఆ తర్వాత మీ కంటెంట్ సెండ్ సర్వర్ నుంచి ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది.
* ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోకపోయినా 24 గంటల్లో సెండ్ సర్వర్స్ నుంచి డిలీట్ అయిపోతుంది.