ప్రపంచ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన చైనా దిగ్గజం హువాయి కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ హువాయి టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ OS లైసెన్స్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హువాయి కంపెనీతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే.. హార్డ్ వేర్ ట్రాన్స్ ఫర్, సాఫ్ట్ వేర్, టెక్నికల్ సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో హువాయి స్మార్ట్ఫోన్ న్యూ డిజైన్స్ ప్లే స్టోర్లో కొన్ని గూగుల్ యాప్స్ ను యాక్సస్ అయ్యే అవకాశం కోల్పోనున్నాయి.
హువాయికంపెనీ పబ్లిక్ ఆండ్రాయిడ్ వెర్షన్ ను ఓపెన్ సోర్స్ లైసెన్స్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చునని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇతర టెక్ కంపెనీలైన ఇంటెల్, క్వాల్ కామ్న్, జిలింక్స్, బ్రాడ్ కామ్ కంపెనీలు హువావేకు సరఫరా చేసే సాఫ్ట్ వేర్, ఇతర కంపోనెంట్స్ కూడా నిలిపివేసినట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఈ టెక్ దిగ్గజాలన్నీ యూఎస్ డిపార్ట్ మెంట్ నిర్ణయానికి కట్టుబడి తమ సర్వీసులను నిలిపివేసినట్టు తెలిపాయి.
కాగా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇటీవల అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం టెక్ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన విషయం అందరికీ విదితమే. యూఎస్ ప్రభుత్వం నిర్ణయంతో గూగుల్ కూడా హువాయి కంపెనీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం.. హువాయి ఆండ్రాయిడ్ వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎలాంటి సమస్య లేదు. గూగుల్ యాప్స్ నుంచి ఇతర యాప్స్ అప్ డేట్స్ డౌన్ లోడ్ చేసుకోనే వీలుంది.
హువాయి లైసెన్స్ రద్దు నిర్ణయంతో స్మార్ట్ ఫోన్ కంపెనీ బిజినెస్ కు చైనా దేశం బయట భారీ ఎఫెక్ట్ పడనుందనే వార్తలు వెలువడుతున్నాయి. హువాయి ఫోన్లలో రన్ అయ్యే ఫ్యూచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఇకపై గూగుల్ సర్వీసుల్లోని యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ ప్లే స్టోర్ వంటి యాక్సస్ ను కోల్పోనుంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సస్ తక్షణమే కోల్పోనున్నట్టు కూడా నివేదికలు తెలిపాయి. ఆండ్రాయిడ్ లైసెన్స్ రద్దుపై హువావే నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఈ ప్రకటన తరువాత గూగుల్ వెంటనే మరో ప్రకటనను కూడా విడుదల చేసింది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా హువాయి కంపెనీ ఆండ్రాయిడ్ లైసెన్స్ రద్దుపై ఈ కొత్త ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ ప్రకటన ప్రకారం ప్రస్తుతం హువాయి (హానర్) కొత్త స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెక్యూరిటీ, గూగుల్ ప్లే సర్వీసులను యాక్సస్ చేసుకోవచ్చునని తెలిపింది.