• తాజా వార్తలు

మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ వ‌స్తుందో? లేదో?


గూగుల్ నుంచి రానున్న స‌రికొత్త ఆప‌రేటింగ్ సిస్టం.. ఆండ్రాయిడ్ ఓ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆసక్తి రేపుతోంది. దీనిలో చాలా కొత్త ఫీచ‌ర్ల‌ను గూగుల్ ప‌రిచ‌యం చేస్తోంది. అయితే తొలిడెవ‌లప‌ర్ ప్రివ్యూ నెక్సస్ 5ఎక్స్‌, నెక్స‌స్ 6పీ, నెక్స‌స్ ప్లేయ‌ర్‌, పిక్సెల్‌, పిక్సెల్ ఎక్స్ఎల్‌, పిక్సెల్ సి డివైజ్‌లకే ప‌రిమిత‌మైంది. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ వ‌స్తుందో లేదో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ కింద లిస్ట్ చ‌ద‌వండి. టెక్నాల‌జీ ఎక్స్‌ప‌ర్ట్‌ల లెక్క‌ల ప్ర‌కారం ఈ కింది ఫోన్ల‌కు అప్‌డేట్లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. చూసి అందులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అయితే ప్ర‌స్తుతానికి ఇది అంచ‌నా మాత్ర‌మే. మ‌రిన్ని స్మార్ట్‌ఫోన్ల‌కు అప్‌డేట్ వ‌చ్చే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ , గూగుల్ పిక్సెల్ 2ఎక్స్ ఎల్ , గూగుల్ నెక్స‌స్ 5ఎక్స్‌, గూగుల్ నెక్స‌స్ 6పీ ఫోన్ల‌కు గూగుల్ ఓ.. ఓఎస్ అప్‌డేట్ రావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

మోటోరోలా
ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు వ‌స్తుండేవి. అయితే దీన్ని లెనోవో తీసుకున్నాక ఈ ప‌రిస్థితి మారిపోయింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్ తో వ‌చ్చిన మోటో ఈ3 ప‌వ‌ర్ అప్ప‌టి నుంచి ఒక్క అప్‌డేట్ కూడా పొంద‌క‌పోవ‌డం దీనికి ఉదాహ‌ర‌ణ‌. అయితే త‌ర్వాత వ‌చ్చిన చాలా ఫోన్లు ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్ ఓఎస్‌తో ఉండ‌డంతో ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ ను కూడా రిలీజైన కొన్ని నెల‌ల్లోనే పొందుతాయ‌ని అంచ‌నా. మోటో జెడ్‌2, మోటో జెడ్‌2 ప్లే, మోటో ఎక్స్‌4, మోటో జీ5ఎస్‌, మోటో జీ5ఎస్+, మోటో జీ5, మోటో జీ5+, మోటో ఈ4, మోటో ఈ4+, మోటో జెడ్‌, మోటో జెడ్ ప్లే మోడ‌ల్స్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ రావ‌చ్చు.

శాంసంగ్‌

సాఫ్టేవ‌ర్ అప్‌డేట్స్ రిలీజ్ చేయ‌డంలో శాంసంగ్ అంత ఫాస్ట్‌గా ఉండ‌దు. అయినా దీని హై ఎండ్ స్మార్ట్‌ఫోన్లు క‌చ్చితంగా ఓ.. అప్డేట్ పొందే అవ‌కాశం ఉంది. అశాంసంగ్ గెలాక్సీ నోట్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8+, శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఏ7 2017, శాంసంగ్ గెలాక్సీ ఏ5 2017, శాంసంగ్ గెలాక్సీ ఏ3 2017 మోడళ్లకు అప్డేట్ వస్తుంది.

ఎల్ జీ

2016లో ఎల్ జీ వీ 20 అనే స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్ కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. ఈ సంవత్సరం ఎల్జీ వీ30 మోడల్ ను తీసుకురాబోతుంది. వీ20 లాగానే వీ30 కూడా ఆండ్రాయిడ్ ఓ.. ఓఎస్ కు బోణీ కొడుతుందేమో చూడాలి. ఎల్జీ వీ30, ఎల్జీ జీ 6, ఎల్జీ వీ 20 మోడల్స్ ఈ అప్డేట్ పొందే ఫోన్ల లిస్ట్ లో ఉండొచ్చు.

నోకియా
నోకియా కొత్త‌గా లాంచ్ చేయ‌నున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు నోకియా 6, నోకియా 5, నోకియా 3, నోకియా 8 ల‌కు ఈ ఓఎస్ అప్‌డేట్ రావ‌చ్చు.

హువావే : హువావే మేట్ 9, హువావే పీ 10, హువావే పీ10 ప్ల‌స్,

వ‌న్ ప్ల‌స్ : వ‌న్ ప్ల‌స్ 3, వ‌న్ ప్ల‌స్ 3టీ, రాబోయే వ‌న్ ప్ల‌స్ 5

బ్లాక్‌బెర్రీ : బ్లాక్‌బెర్రీ కీ వ‌న్‌, బ్లాక్‌బెర్రీ అరోరా, బ్లాక్‌బెర్రీ డీటెక్ 50, బ్లాక్‌బెర్రీ డీటెక్ ౬౦

హెచ్‌టీసీ: హెచ్‌టీసీ యూ 11, హెచ్‌టీసీ యూ అల్ట్రా, హెచ్‌టీసీ యూ ప్లే, హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్ల‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్డేట్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

జన రంజకమైన వార్తలు