స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఒకటైన విండోస్ కథ ముగిసిపోయింది. నోకియాతో మొదలై మైక్రోసాఫ్ట్ చేతికి చేరిన ఈ ఓఎస్‌కు ఇకపై ఎలాంటి అప్‌డేట్స్ రిలీజ్ చేయకూడదని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం విండోస్ ఫోన్లలో అత్యధికంగా వాడుతున్న విండోస్ ఫోన్ 8.1 ఓఎస్‌కు ఇక నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రావని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
80% విండోస్ ఫోన్లలో ఇదే ఓఎస్
విండోస్ ఫోన్ 7.xకు 2014లోనూ, విండోస్ ఫోన్ 8కు 2016లోనూ అప్‌డేట్స్ ను కంపెనీ ఆపేసింది. ప్రస్తుతం 80% విండోస్ ఫోన్లు.. విండోస్ ఫోన్ 8.1 ఓఎస్‌తోనే రన్ అవుతున్నాయి. Lumia 1520, Lumia 930, Lumia 830, Lumia 735 మోడల్స్ అన్నీ ఈ ఓఎస్‌పైనే పని చేస్తున్నాయి. దీనికి అప్‌డేట్స్ ఆగిపోవడంతో ఇకపై ఈ ఓఎస్‌కు ఎలాంటి సెక్యూరిటీ ప్యాచెస్, బగ్ ఫిక్సెస్‌వంటివి ఏమీ రావు. అంటే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ప్రాబ్లమ్స్ లేకుండా ఎంతకాలం నడిస్తే అంతవరకూ వాడుకోవడం ఒక్కటే విండోస్ ఫోన్ యూజర్లకు మిగిలిన ఆప్షన్.
ఏడాది క్రితమే ప్లానింగ్
విండోస్ మొబైల్ ఓఎస్‌లను ఎంతోకాలం నడిపించలేమని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏడాది కిందటే హింట్ ఇచ్చారు. మేం మొబైల్ ఫోన్‌ను మిస్సవుతున్నామని ఆయన అప్పుడే ప్రకటించారు. మొబైల్ ఓఎస్ ప్లేస్‌లో మిగతా మొబైల్ ఫ్లాట్‌ఫామ్స్ పైన కూడా పనిచేసే యాప్‌ల తయారీకి మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తగ్గట్లే విండోస్ ఫోన్లలో ఎలాంటి అప్‌డేట్లు లేకపోవడంతో లింక్‌డిన్, వాట్సాప్‌లాంటి చాలా పాపులర్ యాప్‌లు ఇప్పటికే విండోస్ ఫోన్లలో ఎలాంటి అప్‌డేట్లు లేకుండా కొనసాగుతున్నాయి. కొన్ని యాప్‌లయితే మొత్తానికి లేవు కూడా.