చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే దాన్ని ఎన్నో అవసరాలకు ఉపయోగిస్తాం. ఎన్నో అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేస్తాం. ఆ అప్లికేషన్లలో కొన్ని అవసరమైనవి ఉంటాయి. మరికొన్ని అవసరం లేకపోయినా ఏదో సరదాకు కూడా డౌన్‌లోడ్ చేస్తాం. కానీ వీటివల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో స్సేస్ వృథా అవుతుంది. డివైజ్ పంక్షనింగ్ కూడా స్లో అయిపోతుంది. ఒకసారి ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేశాక వాటిలో అనవసరమైన వాటిని వీలైనంత త్వరగా మన డివైజ్ నుంచి తొలగించాలి. అయితే ఊపిరి సలపని బిజీగా ఉండే మనం వీటిపై దృష్టి కూడా సారించాం. ఇలాంటి స్థితిలో మన మొబైల్ బాగోగులు ఎవరు చూసుకుంటారు? అలాంటి వారి కోసమే వచ్చేసింది మొబొరోబో! దీంతో మన ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లను మేనేజ్ చేయడం చాలా తేలిక. దీని వల్ల మన డివైజ్ స్క్రీన్ ఏమీ పెద్దగా మారిపోదు. కానీ ఉన్న స్పేస్‌నే ఉపయోగించుకుని అప్లికేషన్లను మేనేజ్ చేయడంలో మొబొరోబో ఉపయోగపడుతుంది.
ఎలా ఉపయోగపడుతుంది
మొబొరొబొ అనేది ఒక థర్డ్ పార్టీ డేటా మేనేజర్. దీన్ని ఉపయోగించి మీ కంప్యూటర్ స్క్రీన్ నుంచే ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌లను మేనేజ్ చేయగలగడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే మొబొరొబో ద్వారా నేరుగా పీసీ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ విండోస్ ఓఎస్ వాడుతున్న వారందరికి ఉచితంగా లభిస్తుంది. దీన్ని పీసీ నుంచే డౌన్‌లోడ్ చేసు్కోవచ్చు. 23 ఎంబీతో కూడిన ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పీసీని యూఎస్‌బీ కనెక్టర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
కీలకమైన డేటాను రీస్టోర్ చేయడానికి
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఐఫోన్‌లో ఉండే కీలకమైన డేటాను రీస్టోర్ చేయడానికి మొబొరోబో ఉపయోగపడుతుంది. మీరు ఒక డివైజ్‌ను కొంటే అందులో ఉన్న కీలమైన సమాచారాన్ని సేవ్ చేసి దాచుకోవడానికి కూడా మొబొరొబో సాయం చేస్తుంది. కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, కాల్ లాగ్స్, మీడియా యాప్స్ ఇలా అన్ని రకాల డేటాను మనం సేవ్ చేసుకోవచ్చు. ఇతర థర్డ్ పార్టీ మేనేజ్‌మెంట్ అప్లికేషన్లలా కాకుండా కాల్స్, ఎస్ఎంఎస్‌లను కంట్రోల్ చేయడానికి మొబొరోబో ఉపయోగపడుతుంది. పీసీని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపొచ్చు.