వన్‌ప్లస్.. తన స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ 3, వన్‌ప్లస్ 3టీలకు ఆండ్రాయిడ్ 7.1.1. నూగట్ బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్లు అందిస్తోంది. ఈ అప్‌డేట్స్‌తో తన స్మార్ట్‌ఫోన్లకు కంపెనీ సిస్టం పుష్ నోటిఫికేషన్స్ అందజేయడానికి అవకాశం కలుగుతుంది. సిస్టం పుష్ నోటిఫికేషన్ల వల్ల యూజర్లు కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్‌ను నేరుగా పొందగలుగుతారు. దీంతోపాటు రిలయన్స్ జియో సిమ్ కార్డ్‌లతో తలెత్తుతున్న VoLTE సమస్య వంటివి అధిగమించేలా బగ్స్ ఫిక్స్ అవుతాయి.
ఇవీ ఉపయోగాలు
ఈ కొత్త ఆక్సిజన్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్‌తో వన్‌ప్లస్ 3, వన్‌ప్లస్ 3టీ ల్లో బగ్ ఫిక్సెస్ పూర్తవుతాయి. థర్డ్ పార్టీ ఫైల్ మేనేజర్స్‌లో స్టోరేజ్, రిలయన్స్ జియో సిమ్ వాడడం వల్ల VoLTE ఇష్యూను క్లియర్ చేసేలా బగ్ ఫిక్సవుతుందని కంపెనీ ప్రకటించింది. బ్యాటరీ, వైఫై,బ్లూ టూత్, జీపీఎస్ ఫీచర్లకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టం ఫీచర్లను ఈ అప్‌డేట్ ఆప్టిమైజ్ చేస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సర్, లో లైట్ ఫోకస్ ఆన్ కెమెరా, ఎక్స్‌పాండెడ్ స్క్రీన్‌షాట్ వంటి వాటికి కూడా ఈ అప్‌డేట్‌తో ఆప్టిమైజేషన్స్ రాబోతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఓఎస్‌కు స్టెబిలిటీ కూడా పెరుగుతుందని వన్‌ప్లస్ ప్రకటించింది. మిగతా అప్‌డేట్ల మాదిరిగానే ఈ ఆక్సిజన్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్ కూడా యూజర్లకు దశలవారీగా అందుతుందని చెప్పింది.