ఆండ్రాయిడ్ ఓ.. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ఏడాదిలో తీసుకురానున్న కొత్త ఆపరేటింగ్ సిస్టం. మార్చిలో దీనికి డెవలపర్ ప్రివ్యూ వెర్షన్ ను గూగుల్
రిలీజ్ చేసింది. ఇప్పటికి మూడు అప్‌డేట్లు వచ్చాయి. ఇంకో రెండు, మూడు అప్‌డేట్లు ఇచ్చి సెప్టెంబర్‌లో యూజర్లందరికీ అందుబాటులోకి తేవాలని
ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓఎస్ లు అన్నింటికంటే డిఫరెంట్, యూనిక్ ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఓఎస్ రానుంది. అవేంటో తెలుసుకోండి
మరి..
రిచ్ మీడియా నోటిఫికేషన్లు..
ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఓఎస్‌లలో యూజర్లకు వచ్చే నోటిఫికేషన్లు ఐకాన్స్, ఇమేజెస్ లేదా టెక్స్ట్ ఇలా ఏవైనా బ్లాక్ అండ్ వైట్‌లోనే
ఉంటున్నాయి. డివైస్‌లో ఉండే ఆల్బం ఆర్ట్, వీడియో థంబ్ నెయిల్స్‌ను ఓ స్పెషల్ కోడ్‌తో స్కాన్ చేయడం వల్ల కొత్తగా రానున్న ఆండ్రాయిడ్ O
(8.0)లో ఈ నోటిఫికేషన్లు కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. వీటిని రిచ్ మీడియా నోటిఫికేషన్లు అంటారు. గూగుల్ ప్లే మ్యూజిక్, స్పాటిఫై, యూ ట్యూబ్
మ్యూజిక్ వంటి యాప్స్‌కు ముందుగా ఈ రిచ్‌మీడియా నోటిఫికేషన్స్ అందుబాటులోకి వస్తాయి.
పిక్చర్ ఇన్ పిక్చర్
ఒక వీడియో, ఫొటోలో మరో వీడియో లేదా ఫొటోను ఒకేసారి చూసుకునే స్పెషల్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఓ తీసుకొస్తోంది. దీన్ని PIP (Picture
In Picture) అంటారు.
ఆటోసైజింగ్ టెక్స్ట్ వ్యూ
ఎక్కువ టెక్ట్స్ ఉన్న డాక్యుమెంట్లు, వెబ్ పేజీలను చదవాలంటే మనమే టెక్స్ట్ సైజును పెంచుకోవడాని మనమే సెట్ చేసుకుంటున్నాం. అయితే
ఆటోమేటిగ్గా సైజ్ ఎడ్జస్ట్ అయ్యేలా autosizing TextView అనే యూనిక్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఓ తీసుకురాబోతుంది.
మరిన్ని యూనిక్ ఫీచర్స్
* ఆండ్రాయిడ్ ఓఎస్‌లు అన్నింటికంటే డిఫరెంట్‌గా యాప్స్, గేమ్స్ ఐకాన్లను చూడగానే ఎట్రాక్ట్ చేసేలా డిజైన్ చేస్తున్నారు.
* వెబ్‌సైట్ల డిఫాల్ట్ సెట్టింగ్స్‌కు అనుగుణంగా పనిచేసేలా WebView సెట్టింగ్ వస్తోంది.
* యూజర్స్ వెబ్‌సైట్లు, డాక్యుమెంట్లలో నింపే autofill ఫాంకు కొత్త హంగులు తీసుకొస్తున్నారు. దీన్ని ఈజీగా యూజ్ చేసుకునేలా
ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేస్తున్నామని గూగుల్ ప్రకటించింది.