• తాజా వార్తలు

క్ష‌ణాల్లో మీకు కావాల్సిన‌ట్లు లోగోను ఉచితంగా డిజైన్ చేసి ఇచ్చే.. డిజైన్ ఇవో

ఏ సంస్థ‌కైనా లోగో అనేది చాలా ముఖ్యం. అది ఎంత యూనిక్‌గా ఉంటే అంత పాపుల‌ర్ అవుతుంది.  ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌బ‌స్ వ‌ర‌కు పెద్ద పెద్ద సంస్థ‌ల‌న్నింటినీ మ‌నం లోగో చూసి గుర్తు పట్టేస్తాం. అమెజాన్ లోగో చూడండి. అందులో ఏ నుంచి జెడ్ వ‌ర‌కు ఓ యారో ఉంటుంది. అంటే త‌మ సైట్‌లో ఏ టూ జెడ్ అన్ని వ‌స్తువులూ దొరుకుతాయ‌ని చెప్ప‌డం ఆ లోగో డిజైనింగ్‌లో ఉన్న థీమ్‌. అలా మీ బిజినెస్‌కు  కూడా లోగో కావాలంటే ఏం చేయాలి?  వేల‌కు వేలు ఖ‌ర్చుపెట్టి డిజైనర్ల‌తో చేయించుకోవ‌క్క‌ర్లేదు. వేలాది డిజైన్ల‌తో మీకు ఫ్రీగా లోగో డిజైన్ చేసి ఉచితంగా అందించే వెబ్‌సైట్ ఉంది. దీనిపేరు డిజైన్ ఇవో. 
10 ల‌క్ష‌ల ఐకాన్లు. 100 ఫాంట్లు
మీకు కావాల్సిన‌ట్లు లోగో డిజైన్ చేసుకోవ‌డానికి డిజైన్ ఇవోలో లార్జ్ డేటాబేస్‌లో ఐకాన్స్ ఉన్నాయి. ప్ర‌తిదీ ప్రొఫెష‌న‌ల్‌గా డిజైన్ చేశారు. స్కేలింగ్ కూడా ఈజీ. ఎంత త‌గ్గించినా, ఎంత పెంచినా క్వాలిటీ త‌గ్గ‌కుండా తీర్చిదిద్దారు. టెక్నాల‌జీ నుంచి రియ‌ల్ ఎస్టేట్ వ‌ర‌కు, కాఫీ షాప్ నుంచి కాస్మోటిక్ స్టోర్ వ‌ర‌కు అన్ని బిజినెస్‌ల‌కు సంబంధించిన ఐకాన్స్ అందుబాటులో ఉన్నాయి.  ఇక టెక్స్ట్ మేట‌ర్‌కు వ‌స్తే వంద‌కు పైగా ఫాంట్లు అందుబాటులో ఉంచారు.   ఇవికాక డిఫ‌రెంట్ క‌ల‌ర్స్‌, ఫాంట్స్‌,టెక్స్ట్ ఎఫెక్ట్‌ల‌తో చూడ‌ముచ్చ‌టైన వ‌ర్డ్ ఆర్ట్స్‌ను పెట్టారు.  స‌ర్కిల్ నుంచి స్క్వేర్ వ‌ర‌కు, రెక్టాంగిల్ నుంచి 
ఇవీ ఫీచ‌ర్లు
* డిజైన్ ఇవో ఫ్రీ సాపఫ్ట్‌వేర్‌. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, స‌ఫారీ, ఐఈ వంటి ఫేమ‌స్ బ్రౌజ‌ర్ల‌న్నింటిలోనూ ప‌ని చేస్తుంది. 
* ఫ్రీ స‌ర్వీస్‌, అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్‌
* రిజిస్ట్రేష‌న్ అక్క‌ర్లేదు
* ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఆన్‌లైన్‌లో మీ లోగోను నిమిషాల్లో క్రియేట్ చేసుకోవ‌చ్చు.
* 10 ల‌క్ష‌ల‌కు పైగా ఐకాన్స్, వంద‌ల కొద్దీ ఫాంట్స్‌, వ‌ర్డ్ ఆర్ట్స్ ఉన్నాయి  
* ఇంగ్లీష్‌తోపాటు జ‌ర్మ‌న్‌, జ‌ప‌నీస్‌, పోర్చుగీస్‌, ఫ్రెంచ్‌, చైనీస్‌, స్పానిష్ ఇలా మ‌ల్టిపుల్ లాంగ్వేజస్‌ను స‌పోర్ట్ చేస్తుంది.

జన రంజకమైన వార్తలు