• తాజా వార్తలు

షియోమీ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ వేటికి వ‌స్తుందో తెలుసా?

ఆండ్రాయిడ్ కొత్త వెర్ష‌న్.. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఇంకా ఇండియాలో చాలా స్మార్ట్‌ఫోన్ల‌కు అందుబాటులోకి రాలేదు. గూగుల్ పిక్సెల్ లాంటి ఫోన్లు, నోకియా 7 ప్ల‌స్ లాంటి లేటెస్ట్ మోడ‌ల్స్ మాత్ర‌మే ఓరియో అప్‌డేట్‌తో ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. పాత ఫోన్ల‌కు ఒక్కొక్క‌టిగా ఈ ఓరియో అప్‌డేట్ వ‌స్తోంది.  ఇక ఇండియాలో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడ‌వుతున్న షియోమి స్మార్ట్‌ఫోన్ల‌లో వేటికి ఓరియో అప్‌డేట్ వ‌స్తుందో చూద్దాం.
ఆండ్రాయిడ్ ఓరియో ఫీచ‌ర్స్‌

* ఆప్టిమైజేష‌న్స్‌, సెక్యూరిటీ ఫీచ‌ర్స్ ప‌రంగా మంచి అప్‌డేట్‌

* కొత్త నోటిఫికేష‌న్ సెటప్‌

* పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ మోడ్‌ను స‌పోర్ట్ చేయ‌డం

* కొత్త ఎమోజీలు, అడాప్టివ్ ఐకాన్స్ కోసం స‌పోర్ట్‌

* బూట్ టైమ్ ఫాస్ట్‌గా చేసి సిస్ట‌మ్‌ను స్పీడ్‌గాఅప్‌గ్రేడ్ చేయ‌డానికి ప్రాజెక్ట్ ట్రెబెల్‌, 

* మ‌ల్టిపుల్ డిస్‌ప్లే స‌పోర్ట్ ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ అప్‌డేట్‌లో కొత్తగా రాబోతున్నాయి. 

ఎంఐ సిరీస్ ఫోన్ల‌కు..
షియోమిలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌యిన ఎంఐ సిరీస్ ఫోన్ల‌కు ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ వస్తుంది. అంటే ఎంఐ మిక్స్‌, ఎంఐ మిక్స్‌2, ఎంఐ నోట్ 3, ఎంఐ ఏ1, ఎంఐ మ్యాక్స్‌2, ఎంఐ మ్యాక్స్‌, ఎంఐ 5ఎస్‌, ఎంఐ 5 ఎస్ ప్ల‌స్‌, ఎంఐ నోట్ 2, ఎంఐ 5ఎక్స్‌ల‌కు ఓరియో అప్‌డేట్ వ‌స్తుంద‌ని కంపెనీ చెబుతోంది.
 

రెడ్‌మీ ఫోన్లు 
షియోమి కంపెనీ బ‌డ్జెట్ ఫోన్లుగా రిలీజ్ చేస్తున్న రెడ్‌మీ సిరీస్‌లోని కొన్ని ఫోన్ల‌కు కూడా ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ రానుంది.
రెడ్‌మీ నోట్‌4, రెడ్‌మీ 4, రెడ్‌మీ 5ఏ, రెడ్‌మీ నోట్ 5ఏ,  రెడ్‌మీ నోట్ 5ఏ ప్రైమ్‌, రెడ్‌మీ వై1 లైట్‌
 

వీటికి రాదు
రెడ్‌మీ 3, రెడ్‌మీ 3 ఎస్ ప్రైమ్‌, రెడ్‌మీ నోట్ 3 ప్రో, రెడ్‌మీ నోట్ 3, రెడ్‌మీ 2ల‌కు ఈ ఓరియో అప్‌డేట్ రాదు. 

ఎంఐ 5, ఎంఐ 4ఐ, ఎంఐ 4 ఎస్‌, ఎంఐ ప్యాడ్‌, ఎంఐ ప్యాడ్ 2ల‌కు కూడా ఓరియో అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశాల్లేవు.

జన రంజకమైన వార్తలు