• తాజా వార్తలు

ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్


సిమ్ కార్డు కావాలంటే ఆధార్, గ్యాస్ సబ్సిడీకి ఆధార్, పాన్ కార్డుకు ఆధార్, డ్రైవింగు లైసెన్సుకు ఆధార్, బ్యాంకు అకౌంటుకు ఆధార్... ఇలా దేశంలో ప్రతిదానికీ ఆధారే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకేకాదు, ఇతరత్రా సేవలకు కూడా ఆధార్ ను అనుసంధానం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అవుతున్నది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకూ ఆధార్ లింకయిపోతోంది.

ఆధార్ ఎంట్రీ కోసం
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఆయా యాప్‌లలో ఇప్పటి వరకు ఆధార్ నంబర్‌ను యూజర్లు మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ అలాంటి అవసరం లేకుండా ఫోన్‌లో అవసరం ఉన్నప్పుడు ఆధార్‌ను వాడుకునేందుకు గాను ఓ కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్నారు. త్వరలో ఇది యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇండస్ తీసుకొస్తోంది..
దేశీయ ఆండ్రాయిడ్ ఓఎస్ తయారీ సంస్థ ఇండస్ ఓఎస్, ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ ప్రొవైడర్ డెల్టా ఐడీ సంస్థ రెండు కలిసి సంయుక్తంగా కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారు చేస్తున్నాయి. దీంట్లో ఆధార్ నంబర్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. దాన్ని యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. పేమెంట్లు చేసుకోవడం, ఇతర సేవలకు అథెంటికేషన్ ఇవ్వడం తేలికవుతుంది.

ఐరిస్ స్కానింగ్ తో..
ఈ ఓఎస్ ఉన్న ఫోన్‌ను యూజర్లు ఆన్ చేయగానే తమ కళ్లను ఆ ఫోన్ కెమెరా ఎదుట పెట్టి ఐరిస్ స్కాన్ చేయాలి. దీంతో ఆ వివరాలు యూఐడీఏఐ సర్వర్‌కు అనుసంధానం అయి వెరిఫై అవుతాయి. దీంతో యూజర్ ఆధార్ నంబర్ ఫోన్‌లో ఫీడ్ అవుతుంది. ఆ తరువాత ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్ సేవలను ఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఓఎస్ కలిగిన ఫోన్లను మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, కార్బన్, సెల్‌కాన్, స్వైప్ సంస్థలు తయారు చేయనున్నాయి.

జన రంజకమైన వార్తలు