• తాజా వార్తలు

మ్యూజిక్ ఎఫెక్ట్స్‌తో సహా ఉచిత స్లైడ్ షోలు చేసి పెట్టే 5 టూల్స్ మీకోసం..

మీ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకున్న ఫోటోలను ఆకర్షణీయమైన స్లైడ్ షోలుగా రూపొందించుకోవచ్చు. ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యేలా పొందుపర్చుకోవచ్చు. ఈ  స్లైడ్ షోలకు మ్యూజిక్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయవచ్చు. కేవలం ఫోటోలు మాత్రమే కాదు వీడియోలకు కూడా మ్యూజిక్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ...అందమైన  స్లైడ్ షోలు క్రియేట్ చేయవచ్చు. మ్యూజిక్ ఎఫెక్ట్స్‌తోపాటు ఫ్రీగా  స్లైడ్ షోలను క్రియేట్ చేసే 5 టూల్స్ మీకోసం...
స్లైడ్ మేకర్ వెబ్‌సైట్లను ఉపయోగించాలంటే ముందుగా మీరు ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఈ  స్లైడ్‌మేకర్స్ కొన్ని ఎక్కువ రిజల్యూషన్ లో ఉన్న ఫోటోలను ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌  స్లైడ్‌ మేకర్స్‌తో మీరు తక్కువ సమయంలోనే, ఈజీగా అందమైన స్లైడ్స్‌ను రూపొందించుకోవచ్చు.
కిజోవా(Kizoa)
ఇది ఒక ఆన్‌లైన్  స్లైడ్ షో మేకర్ టూల్.  దీనితో సులభంగా మ్యూజిక్ ఎఫెక్ట్స్‌తో  స్లైడ్ షోలను క్రియేట్ చేసుకోవచ్చు. 50 కంటే ఎక్కువ టెంప్లేట్స్, మ్యూజిక్ క్లిప్స్ ఇందులోఉన్నాయి. వీటన్నింటిని  స్లైడ్ షోల కోసం  ఉపయోగించుకోవచ్చు.  స్లైడ్ షోను క్రియేట్ చేయడానికి ఒక మూవీని సెలక్ట్ చేసుకోండి. మీరు టెంప్లేట్‌ను  ఉపయోగించాలనుకుంటున్నారా లేదా స్క్రాచ్ నుంచి స్టార్ట్ కావాలా అని అడుగుతుంది. స్లైడ్ షో కోసం టెంప్లేట్ సెలక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను యాడ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సొంత మ్యూజిక్  కూడా అప్‌లోడ్  చేసుకోవచ్చు. డ్రాగ్, డ్రాప్ ద్వారా ఫోటోల ఆర్డర్‌ను కూడా మార్చుకోవచ్చు. స్లైడ్ షో పూర్తయ్యాక షేర్ చేసుకోవడానికి URLను జ‌నరేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసిన స్లైడ్ షోను సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.
పికోవికో (Picovico)
ఇది మ్యూజిక్, ఎఫెక్ట్స్ ఆన్‌లైన్ స్లైడ్ మేకర్. ఇందులో మీరు ప్రతి ఫోటోకు టెక్స్ట్‌ను యాడ్ చేయవచ్చు. ఫిల్టర్లకు టెక్స్ట్‌ను అప్లై చేసి ఫోటో క్రాప్ చేయవచ్చు. స్లైడ్‌లోని ప్రతి ఫోటో డిఫాల్ట్ టైం డ్యూరేషన్‌కు అనుగుణంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రతి ఫోటోకు డిఫరెంట్ మ్యూజిక్ యాడ్ చేయవచ్చు. ఈ  స్లైడ్‌ షోలో మీరు 30 ఫోటోలవ‌ర‌కు యాడ్ చేసుకోవ‌చ్చు. 360p, 480p,720p రిజల్యూషన్లో స్లైడ్ షో చేయగలదు. కానీ ఫ్రీగా కేవలం 360పిక్సెల్స్ రిజల్యూషన్‌లో మాత్రమే క్రియేట్ చేయవచ్చు. ఇలా క్రియేట్ చేసిన వీడియోను యూట్యూబ్ కానీ ఫేస్‌బుక్‌లో డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయవచ్చు.
రోక్సియో ఫోటోషో (Roxio photoshow)
 ఈ ఆన్‌లైన్ స్లైడ్ మేకర్ ద్వారా ప్రతి ఫోటోకు పర్సనల్‌గా , మొత్తం స్లైడఃకు క్యాప్షన్, చాట్ బబుల్స్, టైటిల్స్, స్టిక్కర్స్, బార్డర్స్ యాడ్ చేయవచ్చు. స్పీడ్‌ను కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్‌తో ప్రయోగాలు చేస్తున్నపుడు, ఒక ప్రైవేట్ షేర‌బుల్ లింక్‌ను క్రియేట్ చేయవచ్చు. దీన్ని నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు. అయితే ఇక్కడ యూజర్ల కోసం ఎలాంటి ఫ్రీ డౌన్‌లోడ్ ఆప్షన్స్ లేవు.
ఫోలోడీ (Pholody)
ఇది ఒక సింపుల్ మ్యూజిక్  స్లైడ్ షో మేకర్. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. అయితే ఇత‌ర మేక‌ర్స్‌లో ఉన్న‌న్ని ఫీచ‌ర్లు లేక‌పోవ‌డం కాస్త మైన‌స్‌. ఫోలోడీతో  స్లైడ్ చేయడానికి మీ ఫోటోలు, మ్యూజిక్ క్లిప్‌ను ఎడిటర్‌కు అప్‌లోడ్ చేయాలి. దీనిలో ఫేస్‌బుక్‌, గూగుల్ ఫోటోల నుంచి ఫోటోలను ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మ్యూజిక్ ఉన్న టెంప్లేట్ల  నుంచి మ్యూజిక్ క్లిప్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ  స్లైడ్ షోను పూర్తి చేసిన తర్వాత మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాజెక్ట్ కోసం సేవ్ చేసుకోవచ్చు. పబ్లిషర్  ఆఫ్షన్‌తో మీరు డైరెక్ట్‌గా  గూగుల్ ఫోటోస్ అకౌంట్‌కు అప్‌లోడ్ చేయవచ్చు.
ఫొటో స్నాక్ (Photosnack)
ఫోటో స్నాక్ కూడా ఒక సింపుల్ ఆన్‌లైన్ స్లైడ్ మేకర్. మీ స్లైడ్ షోను అందంగా, ఆకర్షణీయంగా తయారుచేస్తుంది. స్లైడ్ షోను క్రియేట్ చేయడానికి ముందుగా మీ ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. దాదాపు 15 ఫోటోలతో స్లైడ్ షో క్రియేట్ చేసుకోవ‌చ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ ఫోటోల నుంచి ఫోటోలను ఇంపోర్ట్ చేసుకోవచ్చు.  స్లైడ్ కోసం టెంప్లేట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.  టైం కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఫోటోకు పర్సనల్ పేరు పెట్టుకోవచ్చు. మీరు ఎంటర్ చేసిన పేర్లు స్లైడ్ షోలో కనిపిస్తాయి. వీటితోపాటు ఆడియోను కూడా సెలక్ట్ చేసుకోవాలి. స్లైడ్ షోకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవ‌చ్చు. అడిష‌న‌ల్ యాక్టివిటీని యాడ్ చేయవచ్చు. ఇలా క్రియేట్ చేసిన స్లైడ్ షోను సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు. మీరు ప్రైవేట్ గా జనరేట్ చేసుకోవడానికి లింక్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

 

జన రంజకమైన వార్తలు