డయాబెటిస్ (షుగర్) వ్యాధి ప్రపంచంలో అన్ని దేశాలకంటే మన ఇండియాలోనే ఎక్కువ. మన ఫుడ్, డైట్.. ఇవన్నీ షుగర్ రావడానికి కారణాలు. ఇది ఒకసారి వస్తే కంట్రోల్ ఉంచుకోవడమే తప్ప సమూలంగా నివారించడం సాధ్యం కాదు. పక్కాగా డైట్ పాటిస్తూ.. ఎప్పటికప్పుడు టెస్ట్‌లు చేయించుకుంటూ షుగర్‌ను కంట్రోల్ చేసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి చాలా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బాగున్న నాలుగు సాఫ్ట్‌వేర్‌లు ఇవి. విండోస్‌లో పని చేసే ఆ నాలుగు సాఫ్ట్‌వేర్‌ల గురించి తెలుసుకుందాం.
1. హెల్త్ డయాబెటిక్ సాఫ్ట్‌వేర్ (Health Diabetic Software)
హెల్త్ డయాబెటిక్ సాఫ్ట్‌వేర్ ఉచిత డయాబెటిక్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్. మల్టిపుల్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఫీచర్స్ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇది. డయాబెటిక్ డేటాతోపాటు దానికి రిలేటెడ్‌గా ఉండే బ్లడ్ గ్లూకోజ్, వెయిట్, టెంపరేచర్, ఇన్సులిన్, పెయిన్, మీల్ పెయిన్, బ్లడ్ ప్రెషర్ వంటివన్నీఈ సాఫ్ట్‌వేర్లో సేవ్ చేసుకోవచ్చు. బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ ప్రెషర్ , వెయిట్, టెంపరేచర్, డయాబెటిక్ హైపోగ్లైసీమియా, కొలెస్ట్రాల్, పెయిన్, లెగ్ క్రాంప్స్, వంటి పరీక్షల రిపోర్ట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు.
డయాబెటిక్ రికార్డ్స్ యాడ్ చేయాలంటే For New Users బటన్‌ను క్లిక్ చేసి యూజర్‌ను యాడ్ చేయాలి. పేరు, హైట్, వెయిట్ వంటి పర్సనల్ డిటెయిల్స్ ఎంటర్ చేయాలి. బ్లడ్ గ్లూకోజ్ అప్పర్, లోయర్ లిమిట్స్ సెట్ చేసుకోవచ్చు.
బ్లడ్ గ్లూకోజ్ రిపోర్ట్‌ను క్రియేట్ చేయడం ఎలా?
2. గ్లూకోజ్ ట్రాకర్ (Glucose Tracker)
గ్లూకోజ్ ట్రాకర్ కూడా ఫ్రీ డయాబెటిక్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్. దీనిద్వారా మీరు మల్టిపుల్ బ్‌ిడ్ షుగర్ రిపోర్ట్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
బ్లడ్ గ్లూకోజ్ రిపోర్ట్‌ను క్రియేట్ చేసుకోవడం ఎలా?
హార్ట్ షేస్‌లో ఉన్న ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అప్పడు ఒక న్యూ విండో ఎపెన్ అవుతుంది. దానిలో ఎగ్జామ్ డేట్, టైం, గ్లూకోజ్ లెవెల్, మీ ఆరోగ్య పరిస్థితి, వటివన్నీ యాడ్ చేసి మీ బ్లడ్ గ్లూకోజ్ రిపోర్ట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గ్రాఫ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
3. డయాబెటిస్ అనలైజర్ (Diabetes Analyzer)
విండోస్ 10 పీసీల్లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇఇ. ఈ యాప్‌ను పీసీలో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ హోం స్క్రీన్‌లో ఒక బ్లాంక్ బాక్స్ ఉంటుంది. దీనిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంటర్ చేయాలి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇలా ఏ టైమ్‌లో తీసుకున్నారో సెలెక్ట్ చేయాలి. ఆఫ్టర్ మీల్స్ లేదా బిఫోర్ మీల్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అయ్యాక సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పడు మీ రికార్డ్ సేవ్ అవుతుంది. మీ పాత రిపోర్ట్ కావాలంటే హిస్టరీలోంచి తీసుకోవచ్చు. మీ డయాబెటిక్ లెవెల్స్‌తో గ్రాఫ్స్, స్టాటిస్టిక్స్ తయారుచేసుకోవచ్చు.
4. డయాబెటిస్ మేనేజ్‌మెంట్ (Diabetes Management)
ఇదో సింపుల్ డయాబెటిక్ సాఫ్ట్‌వేర్. మీ బ్లడ్‌లో గ్లైసేటెడ్ హీమోగ్లోబిన్ ను కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూను ఎంటర్ చేసి Guess HbA1cఅనే ఆప్షన్‌ను టాప్ చేస్తే మీ బ్లడ్‌లో గ్లైసేటెడ్ హీమోగ్లోబిన్ ఎంత ఉందో చూపిస్తుంది. అయితే పర్సంటేజ్‌కు బదులు లో, హై అనే ఆప్షన్లే చూపిస్తుంది.