చైనా మొబైల్ మేకర్ హువాయి టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ చేస్తోంది. ఆపిల్ తర్వాత అత్యధిక మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ కి పోటీగా తన సొంత బ్యానర్ లో ఆపరేటింగ్ సిస్టంను త్వరలో తీసుకురాబోతోంది. Huawei executive Richard Yu ఈ మధ్య Die Weltకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని తెలిపారు. అతి త్వరలోనే హువాయి తన సొంత ఆపరేటింగ్ సిస్టంను తీసుకువస్తోందని తెలిపారు. సాప్ట్ వేర్, హార్డ్ వేర్ సైడ్ కంపెనీ పూర్తిగా దృష్టి పెట్టిందని తెలిపారు.
కాగా ఇప్పుడు హువాయి నుంచి వచ్చిన హానర్ ఫోన్లు అన్నీ Google’s Android-based EMUI skin మీద రన్ అవుతాయి. త్వరలో ఈ ఫోన్లు అన్నీ హువాయి సాప్ట్ వేర్ కి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనా పత్రిక అయిన South China Morning Post ఈ విషయాన్ని తన పత్రికలో ప్రచురించింది. ఈ కథనం ప్రకారం హువాయి గత కొన్ని సంవత్సరాల నుంచి సొంత ఆపరేటింగ్ సిస్టం నుండి పనిచేస్తుందని తెలిపారు. యుఎస్ ఇన్విస్టిగేషన్ తర్వాత దీనిపై కసరత్తు చేసిందని తెలిపింది. ZTE smartphone brand కూడా ఇందులో భాగం అయింది.
ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ఆపరేటింగ్ సిస్టంలో దూసుకుపోతున్న తరుణంలో దీనికి పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టంతో రానుంది. వీటికి గట్టి పోటీనివ్వనుంది. కాగా గత కొద్ది సంవత్సరాల నుంచి అన్ని కంపెనీలు తమ సొంత ఓఎస్ మీద దృష్టిని పెడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే శాంసంగ్ Tizen పేరుతో ఓఎస్ ని తీసుకువచ్చింది. అలాగే Microsoft’s Windows OS, Nokia’s Symbian platformsని తీసుకువచ్చాయి. ఇప్పుడు హువాయి వీటి బాటలోనే నడవనుంది. ఇదిలా ఉంటే గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ లు ప్రపంచ మార్కెట్ ని పూర్తిగా ఆక్రమించేశాయి.