• తాజా వార్తలు

కొత్త వైఫై రూటర్ కొంటున్నారా, ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి

ప్రతి ఇంట్లో వై-ఫై కొత్త వైఫై రూటర్ కొంటున్నారా, ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త వై-పై కనెక్షన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి.

మీరు బీఎస్ఎన్ఎల్ వంటి టెలీఫోన్ ప్రొవైడర్ నుంచి వై-ఫై కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే ADSL రౌటర్‌ను ఎంపిక చేసుకోండి. లోకల్ కేబుల్ ఆపరేటర్ వద్ద నుంచి వై-ఫై కనెక్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే non-ADSL రౌటర్‌ను తీసుకోండి. కొత్త వై-పై రౌటర్ కొనుగోలు చేసే ముందు ఇటువంటి స్పెసిఫికేషన్‌‌లను కలిగి ఉన్న రౌటర్‌ను సెలక్ట్ చేసుకోండి...

మీరు ఎంపిక చేసుకునే వై-ఫై రౌటర్ 802.11ac వైర్‌లెస్ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. డ్యుయల్ బ్యాండ్ సపోర్ట్ తో వచ్చే ఈ రౌటర్ 2.4GHz అలానే 5GHz బ్యాండ్‌లను డీఫాల్ట్‌గానే సపోర్ట్ చేస్తుంది. 'n'వైర్‌లెస్ స్టాండర్డ్‌తో వచ్చే రౌటర్స్ కేవలం 2.4GHz వైర్‌లెస్ బ్యాండ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి.

మీరు ఎంపిక చేసుకునే వై-ఫై రౌటర్ 802.11ac వైర్‌లెస్ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. డ్యుయల్ బ్యాండ్ సపోర్ట్ తో వచ్చే ఈ రౌటర్ 2.4GHz అలానే 5GHz బ్యాండ్‌లను డీఫాల్ట్‌గానే సపోర్ట్ చేస్తుంది. 'n'వైర్‌లెస్ స్టాండర్డ్‌తో వచ్చే రౌటర్స్ కేవలం 2.4GHz వైర్‌లెస్ బ్యాండ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి.

సింగిల్ ఎక్సటర్నల్ యాంటెన్నాతో వచ్చే వై-ఫై రౌటర్‌తో పోలిస్తే, రెండు ఎక్సటర్నల్ యాంటెన్నాలతో వచ్చే రౌటర్ ఎక్కువ కవరేజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇంట్లో ఈ విధమైన రౌటర్‌ను సెట్ చేసుకున్నట్లయితే సిగ్నల్ రేంజ్ బాగుంటుంది.

D-Link కంపెనీ ఆఫర్ చేస్తోన్న చాలా వరకు రౌటర్లు మూడు యాంటెన్నాలతో వస్తున్నాయి. వీటిలో Firewall ప్రొటెక్షన్ సౌకర్యం కూడా ఉంటోంది. ఈ ఫీచర్ మీ హోమ్ నెట్‌వర్క్‌ను హ్యాకింగ్ దాడుల నుంచి కాపడుతుంది. మార్కెట్లో దొరుకుతోన్న TP-Link అలానే Netgear రౌటర్లు పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్‌తో వస్తున్నాయి.

రౌటర్‌ను ఎంపిక చేసుకునే ముందు ఈ రౌటర్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లను పూర్తిగా చదవండి. కొంచెం డబ్బులు ఎక్కువైనా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోండి.

జన రంజకమైన వార్తలు