జియో ఫీచర్ ఫోన్ అలాగే నోకియా 8110 ఫోన్లు వాడేవారికి వాట్సప్ అధికారికంగా వాట్సప్ అందుబాటులోకి రానుంది. అలాగే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లకు ఇకపై వాట్సప్ కియోస్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.Jio Phone, Jio Phone 2 and Nokia 8110లతో పాటు KaiOSతో ఆపరేటింగ్ అయ్యే అన్ని కంపెనీల ఫీచర్ ఫోన్లకు వాట్సప్ సదుపాయం రానుంది. ప్రపంచ వ్యాప్తంగా కియోస్ ఫీచర్ ఉన్న ఫీచర్ ఫోన్లకు కియోస్ స్టోర్ ద్వారా వాట్సప్ ఫీచర్ తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లు వాట్సప్ ఫీచర్ తో అలరించనున్నాయి.
KaiOS Store నుండి వాట్సప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి
యూజర్లు తమ ఫీచర్ ఫోన్లలో వాట్సప్ పొందాలనుకుంటే ముందుగా వారు KaiOS Store నుండి వాట్సప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. 512MB and 256MB RAM, దానిపైన ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫీచర్ ఫోన్స్‌లో KaiOS ఆపరేటింగ్ సిస్టం రన్ అవుతోందని వీటన్నింటికి వాట్సప్ ఫీచర్ అందిస్తామని కంపెనీ తెలిపింది.
100 దేశాల్లోని 100 మిల్లియన్స్ ఫీచర్ ఫోన్స్ కియోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తున్నాయని కియోస్ టీం తెలిపింది. అంతేకాకుండా ప్రపంచంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ తరువాత మూడవ ఆపరేటింగ్ సిస్టం ఇదేనని కంపెనీ ప్రకటించింది. Nokia 8110 అలాగే జియో రెండు ఫోన్లు ఫీచర్ ఫోన్ మార్కెట్లో కియోస్ ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లాయని ఈ ఫోన్ల ద్వారానే కియోస్ ఆఫరేటింగ్ సిస్టం మార్కెట్లో దూసుకుపోతుందని తెలిపింది.
ఇప్పుడు కియోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తున్న ఫోన్ల జాబితాను కంపెనీ ప్రకటించింది. ఆ ఫోన్ల లిస్ట్ ఇదే.
Alcatel Go Flip 2, Cat B35, Doro 7050 and 7060, Energy E241S and E241, JioPhone (Reliance Jio), JioPhone 2 (Reliance Jio), MaxCom 241, MTN Smart, Multilaser ZAPP, Nokia 8110 (HMD Global), Orange Sanza, Positivo P70S, WizPhone WP006, Alcatel Go Flip
కియోస్ బ్లాగ్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. గ్లోబల్ వైడ్ గా కియోస్ ఆపరేటింగ్ సిస్టం అంచనాలకు మించి లాభాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ యుగంలో కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైనదిగా ఉన్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్లతో కూడా స్మార్ట్ కమ్యూనికేషన్ అందుకునే విధంగా కియోస్ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. ఫీచర్ ఫోన్లకు వాట్సప్ అందించడం ద్వారా బిలియన్ యూజర్లు ఇకపై స్మార్ట్ వైపై అడుగులు వేయనున్నారు.