ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలపై ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ చేసిన 'వాన్నా క్రై' ర్యాన్ సమ్ వేర్ వైరస్ కు విరుగుడును హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ కనిపెట్టింది. 'జీరోఎక్స్ టీ' అని పిలుస్తున్న ఈ సొల్యూషన్స్ ను కాంప్లెక్స్ ఆల్గరిథం ఆధారంగా అభివృద్ధి చేసినట్టు యూనిక్ సిస్టమ్స్ అనే ఈ సంస్థ చెప్తోంది.
ఎలాంటి సైబర్ అటాక్ నైనా ఎదుర్కొంటుంది..
తాము తయారు చేసిన జీరోఎక్స్ టీ ప్రొడక్ట్ కేవలం 'వాన్నా క్రై' ర్యాన్ సమ్ వేర్ దాడిని మాత్రమే కాకుండా ఎలాంటి సైబర్ దాడులనైనా తట్టుకుంటుందని సంస్థ వర్గాలు చెప్తున్నాయి. ర్యాన్ సమ్ వేర్ దాడులు మాత్రమే కాకుండా, అనధికార యాక్సెస్, డేటా లీకేజీ, డేటా సవరణ, విధ్వంసం వంటి క్లిష్టమైన సాఫ్ట్ వేర్ దాడులను సులభంగా పరిష్కరిస్తుందట ఇది.
త్వరలోనే మీకూ అందుబాటులోకి..
ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు యూనీక్ సిస్టమ్స్ తన సర్వీసెస్ అందిస్తోంది. త్వరలోనే ఈ జీరోఎక్స్ టీని అందరికీ అందుబాటులోకి తేనున్నారు.