• తాజా వార్తలు

స్వ‌దేశీ మైక్రోప్రాసెస‌ర్ ఛాలెంజ్‌.. రూ.4.3 కోట్లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ (మేకిన్ ఇండియా)ను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. స్వ‌దేశీ ప్రాసెస‌ర్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. Swadeshi Microprocessor Challenge- Innovate Solutions For Aatmanirbhar Bharat పేరుతో కాంటెస్ట్‌ను ప్రారంభించింది.  స్వ‌దేశీ ప్రాసెస‌ర్ త‌యారుచేసే కాంటెస్ట్‌లో నెగ్గిన‌వారికి రూ.4.3 కోట్లు బ‌హుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. 

2021 జూన్ వ‌ర‌కు పోటీ
* 2021 జూన్ వ‌ర‌కు ఈ పోటీ ఉంటుంది. స్వదేశీ మైక్రో ప్రాసెస‌ర్ త‌యారుచేయ‌డానికి ఆసక్తి ఉన్న‌వారు ఈ పోటీలో పాల్గొన‌వ‌చ్చు. 

* సెమీ ఫైన‌ల్స్‌కి వ‌చ్చిన 100 మందికి క‌లిపి మొత్తం కోటి రూపాయ‌లు ఇస్తారు.

* 25 మంది ఫైన‌లిస్టుల‌కు రూ. కోటి ఇస్తారు.

* టాప్‌లో నిలిచిన 10 మందికి 2.3 కోట్ల రూపాయ‌లు ఇస్తారు. ఈ మొత్తాన్ని ప్రాసెస‌ర్ త‌యారీకి ఉప‌యోగించవ‌చ్చు. ‌

ఐఐటీ మ‌ద్రాస్‌, సీడాక్‌
ఐఐటీ మ‌ద్రాస్‌, సీడాక్.. శ‌క్తి (32 బిట్‌), వేగా (64 బిట్‌) పేరుతో రెండు మైక్రోప్రాసెస‌ర్లు త‌యారుచేశాయి. వీటిని ఉప‌యోగించుకుని మైక్రోప్రాసెస‌ర్ త‌యారుచేసే పోటీలో పాల్గొనేవారు మైక్రోప్రాసెస‌ర్ త‌యారుచేయొచ్చు.  

జన రంజకమైన వార్తలు