• తాజా వార్తలు

కోడింగ్ నేర్చుకోవడానికి బెస్ట్  యాప్స్ ఇవే

ఈ కంప్యూటర్ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం తప్పనిసరి. మీ కెరీర్ ను డెవలప్ చేసుకోవడానికి కోడింగ్ చాలా యూజ్ అవుతుంది. ప్రొగ్రామ్స్ తయారు చేయడానికి కోసం కోడింగ్ తప్పనిసరి. మరి ప్రస్తుత రోజుల్లో కోడింగ్ నేర్చుుకోవడానికి బెస్ట్ యాప్స్ కొన్ని అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ యాప్స్ ఏమిటో చూద్దామా..

ప్రొగ్రామింగ్ హీరో

కోడింగ్ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న యాప్స్ లో ప్రొగ్రామింగ్ హీరో యాప్ బెస్ట్ అని చెప్పొచ్చు. బిగినెర్స్ కోసం ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ద్వారా కోడింగ్ ను యూజ్ చేసి ఎలా ప్రొగ్రామ్ లు తయారు చేయచ్చో కూడా ఈ యాప్ మనకు నేర్చుతుంది. బేసిక్స్ తో పాటు అడ్వాన్సడ్ కాన్సెప్ట్ లు కూడా యాప్లో ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ యూజ్ చేసైనా వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. పైథాన్ 3 లాంటి లాంగ్వేజ్ లు దీనిలో ఉన్నాయి. 

గ్రాసోఫర్

బిగినర్స్ కోసం అందుబాటులో ఉన్న మరో లాంగ్వేజ్ గ్రాసోఫర్. జావా స్క్రిప్ట్ ను ఉపయోగించి ఇది ప్రొగామింగ్ బేసిక్స్ నేర్పుతుంది. బేసిక్స్ నేర్పించడానికి ఎక్కువగా ప్రాక్టికల్ అప్రోచ్ ను అనుసరిస్తుంది. కోడింగ్ గేమ్స్ తో పాటు కోడింగ్ ద్వారా షేప్స్ ఎలా డ్రా చేయచ్చో కూడా ఈ యాప్ నేర్పుతుంది. మల్టిపుల్ ఛాయిస్ ద్వారా మీకు ట్రైయినింగ్ ఇస్తుంది. ప్రాక్టీస్ సెషన్లను నిర్వహిస్తుంది. 

ఎన్కోడ్

ప్రొగ్రామ్ హీర్, గ్రాసోఫర్ యాప్ లు మీకు ఒక ప్రత్యేకమైన యాప్ ల ద్వారా మీకు కోడింగ్ బేసిక్స్ ను నేర్పిస్తాయి. కానీ ఎన్కోడ్ యాప్ మల్టీపుల్ లాంగ్వేజ్ ల ద్వారా మనకు కోడింగ్ నేర్పుతుంది. మూడు ప్రత్యేకమైన లాంగ్వేజ్ ల ద్వారా మనం కోడింగ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. బేసిక్స్ తో పాటు పైథాన్, జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ లాంటి వాటిని నేర్చుకునే అవకాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు