• తాజా వార్తలు

ఇంటర్మీడియట్ తర్వాత ఐటి కోర్సులు

ఇంటర్మీడియట్ తర్వాత అనేక కోర్సులు ఉన్నప్పటికీ కంప్యూటర్ సంబంధిత కోర్సులకు ఉన్నoత క్రేజ్  మరి దేనికీ ఉండదు. ఈ మధ్య ఈ క్రేజ్ కొంచెం తగ్గినప్పటికీ అవి ఎవర్ గ్రీన్ కోర్సుల గానే పరిగణింపబడతాయి. అయితే అసలు ఇంటర్ తర్వాత ఈ కోర్సుల స్వభావం ఎలా ఉంటుంది, మొత్తం ఎన్ని కోర్సులు ఉంటాయి అనే విషయాలను ఒక్కసారి చూద్దాం.

సాధారణ డిగ్రీ కోర్సులైన బికాం, బి యస్సి ల లో కంప్యుటర్ సమ్మిళిత  కోర్సులు ఉంటాయి. అవే B.COM  కoప్యూటర్స్ మరియు B.SC కంప్యూటర్స్. ఈ కోర్సులలో ప్రాథమిక అంశాలైన  ఎమ్మెస్ ఆఫీస్ తో పాటు ఏవైనా రెండు ప్రొగ్రామ్మింగ్ లాంగ్వేజి లను నేర్పిస్తారు. వీటితొ పాటుగా ఇంటర్నెట్ వాడడం లాంటి అంశాలు  కూడా ఉంటాయి. మొత్తం మీద కంప్యూటర్ అంటే ఒక సమగ్ర అవగాహన వచ్చే విధంగా ఈ కోర్సుల స్వరూపం ఉంటుంది. అయితే ఒక విద్యార్థి తన డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. వీటికి సమాంతరంగా విద్యార్థులు మరికొన్ని కంప్యూటర్ ఆధారిత అప్ప్లికేషన్ లను నేర్చుకోవలసి ఉంటుంది. బీకాం విద్యార్థులైతే తప్పనిసరిగా అకౌంటీంగ్ ప్యాకేజి, ట్యాలీ లంటివాటిని  నేర్చుకొవలసి ఉంటుంది.మిగతా విద్యార్థులైతే జావా ఒరాకిల్ లంటి అధునాతన ప్రొగ్రాం ల తో పాటు డిటి పి ని కూడా నేర్చుకోవలసి ఉంటుంది. అప్పుడు సాధారణ డిగ్రీ విద్యార్థులు కూడా బహుళ జాతి కంపెనీలలో మంచి వేతనం తో కూడిన ఉద్యోగాలను   పొందగలరు.

ఆ తర్వాత కంప్యూటర్ అప్ప్లికేషన్ లు ఎక్కువగా ఉండే కోర్సు ఇంజినీరింగ్. ఇంజినీరింగ్ నందలి దాదాపు అన్ని బ్రాంచిలలోనూ కంప్యూటర్ యొక్క ఉపయోగం బాగా ఉన్నపటికీ కొన్ని కోర్సులలో మాత్రం కంప్యూటర్ పూర్తిగా ఇమిడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి ECE, IT మరియు కంప్యూటర్ సైన్సు. ఈ కోర్సులలో అన్ని రకాల అప్ప్లికేషన్ ల తో పాటు హార్డ్ వేర్ ను కూడా నేర్పిస్తారు.ఇక్కడ కూడా విద్యార్థిని కంప్యూటర్ రంగంలో రాటు తేలే విధంగా సిలబస్ ఉంటుంది. అయితే దురదృష్ట వశాత్తూ మన  విద్యార్థులలో 90 శాతం మంది ఈ నైపుణ్యాలేవీ నేర్చుకోకుండానే బయటకు వస్తున్నారు. ఒకవేళ నేర్చుకున్నా ఇవి మంచి ఉద్యోగం సంపాదించడానికి సరిపోవడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ విద్యార్థి పాత్ర  కూడా కొంత ఉంటుంది.అందుకే విద్యార్థి వీటికి సమాంతరంగా మరికొన్ని అధునాతన కంప్యూటర్ ప్రొగ్రాం  లను నేర్చుకున్నట్లైతే మంచి వేతనంతో  కూడిన ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

అంతేగాక సంబందిత డిగ్రీ కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసినట్లైతే ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందేఅవకాశం ఉంటుంది .

 

జన రంజకమైన వార్తలు