సాఫ్ట్‌వేర్ ఉద్యోగం... దీనికుంటే క్రేజే వేరు.. జీతాల దగ్గర నుంచి స్థాయి వరకు దీనికి ఇచ్చే విలువే సపరేటు. అయితే రాను రాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించడం చాలా హార్డ్ అయిపోతుంది. దీనికి కారణం ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని కోర్సులు మారడం. ఈ కోర్సులు చదివిన వాళ్లకే జాబ్‌లు ఒడిలో వచ్చి వాలుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన కోర్సులు చేసిన వారి కోసం రిక్రూటర్లు పరుగెత్తుకు వస్తున్నారు. మరి టెకీలకు జాబ్‌లు తెచ్చిపెట్ఏ ఆ టాప్-20 కోర్సులు ఏంటో చూద్దామా..
ఈ కోర్సులు హాట్ గురూ
ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కోర్సులు టెకీలకు వరంగా మారాయి. ఒకప్పుడు జావా నేర్చుకుంటేనో లేదా సీ, సీ ప్లస్ ప్లస్ చదివేస్తేనో వచ్చే టెకీ జాబ్‌లు.. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన కోర్సులకు మాత్రమే వస్తున్నాయి. అందుకే ఎంత ఖర్చు పెట్టయినా కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు యువత ఆసక్తి చూపుతోంది. అమీర్‌పేట లాంటి ఏరియాల్లో ఈ కోర్సులకే ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. ఆ కోర్సుల జాబితా ఒకసారి పరికిద్దాం..
1. పైతాన్
2. గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాం ఫండమెంటల్స్
3. అల్గరిథమ్స్ పార్ట్-1
4. పైథాన్ డేటా స్ట్రక్చర్స్
5.టెన్సర్ ఫ్లో ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
6. అల్గరిథమిక్ టూల్ బాక్స్
7. ఏడబ్ల్యూఎస్ ఫండమెంటల్స్
8. యూజింగ్ పైథాన్ టు యాక్సెస్ వెబ్‌డేటా
9. ఇంట్రడక్షన్ టు ప్రొగ్రామింగ్ విత్ మాట్‌ల్యాబ్
10. పైథాన్ బేసిక్స్
11. మిషన్ లెర్నింగ్
12. న్యూట్రల్ నెట్‌వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్
13. డేటా సైన్స్
14. ఫైతాన్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఏఐ
15. ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ ఇన్ పైథాన్
16. మిషన్ లెర్నింగ్ విత్ పైథాన్
17. కన్వోలుషనల్ న్యురల్ నెట్‌వర్క్స్
18. ఇంప్రూవింగ్ డీప్ న్యురల్ నెట్‌వర్క్స్
19. డేటా అనాలసిస్ విత్ పైథాన్
20. డేటా బేస్ అండ్ ఎస్‌క్యూఎల్ ఫర్ డేటా సైన్స్