• తాజా వార్తలు

ఆల్‌టైమ్ టాప్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు ఇవే

కంప్యూట‌ర్ న‌డిచేదే ప్రొగ్రామింగ్ మీద‌. మ‌నం ఒక చిన్న క‌మాండ్ ఇవ్వాల‌న్నా దానికి బ్యాక్ గ్రౌండ్‌లో ఒక ప్రొగ్రామ్ రాసి తీరాలి. అందుకే సాఫ్ట్‌వేర్ నిపుణుల‌కు అంత గిరాకీ.. మ‌నం కొత్త అప్లికేష‌న్ కావాలన్నా.. లేదా ఒక పేజీని సృష్టించాల‌న్నా ఇంకో సైటు త‌యారు చేయాల‌న్నా ప్రొగ్రామ్ మ‌స్ట్‌. అయితే ఒక్క ప‌ర్ప‌స్‌కి ఒక్కో ప్రొగ్రామ్ వాడ‌తారు.. ఇందుకు ఒక్కో లాంగ్వేజ్ ఉప‌యోగిస్తారు. అందుకే కంప్యూట‌ర్‌లో ప‌ట్టు సంపాదించాల‌నుకున్న వాళ్లు త‌ప్ప‌ని స‌రిగా కొన్ని ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి. మ‌రి ఆ లాంగ్వేజ్‌లు ఏంటో తెలుసుకుందాం..

సి లాంగ్వేజ్‌
కంప్యూట‌ర్స్ లాంగ్వేజ్‌ల‌లో అతి పాత లాంగ్వేజ్ సి.. కానీ లాంగ్వేజ్‌ని ఇప్ప‌టికి ఉప‌యోగిస్తున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌ధాన ప్రొగ్రామింగ్‌ల‌లో సి వాడుతున్నారు,. 1972లో డెన్నిస్ రిచీ క‌నిపెట్టిన ఈ లాంగ్వేజ్ ప్రాథ‌మిక ప్రొగ్రామింగ్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. జ‌న‌ర‌ల్ ప‌ర్ప‌స్ లాంగ్వేజ్. 

షెల్‌
ఎక్కువ‌గా వాడే లాంగ్వేజ్‌ల‌లో షెల్ ఒక‌టి. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్  ఎక్కువ‌గా ఈ షెల్ లాంగ్వేజ్ వాడుతోంది. ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు ఏం చేయాలా చెప్ప‌డానికి డైరెక్ట్ క‌మాండ్స్ ఇవ్వ‌డానికి షెల్ ఉప‌యోగిస్తారు. కామ‌న్ ప్రెసెస్‌లు అయిన ఇన్‌స్టాలింగ్‌, అన్ ఇన్‌స్టాలింగ్‌ల కోసం దీన్ని వాడ‌తారు. మేనేజ్‌, బ్యాక్ అప్‌, కాపీ ఫైల్స్ కోసం కూడా ఉప‌యోగిస్తారు.

టైప్ స్క్రిప్ట్‌
టైప్ స్క్రిప్ట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌. దీన్ని మైక్రోసాఫ్ట్ డెవ‌ల‌ప్ చేసి మెయింటెన్ చేస్తోంది. వేగంగా ఎదుగుతున్న లాంగ్వేజ్‌ల‌లో ఇదొక‌టి. జావా స్క్రిప్ట్ మాదిరిగానే సింటాక్స్‌, సెమంటిక్స్ టైప్ స్క్రిప్ట్‌లో ఉంటాయి. పెద్ద అప్లికేష‌న్లు బిల్డ్ చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఇది మైక్రోసాఫ్ట్ ఫ్రీ కోడ్ ఎడిట‌ర్ విజువ‌ల్ స్టూడియో కోడ్‌కు ఇది స‌పోర్ట్ చేస్తుంది.

పీహెచ్‌పీ
పీహెచ్‌పీ అంటే హైప‌ర్ టెక్ట్ ప్రి ప్రాసెస‌ర్.  వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం వాడే ఓపెన్ సోర్స్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. ఇంట్రాక్టివ్ వెబ్ పేజీల‌ను క్రియేట్ చేయ‌డం కోసం కూడా ఈ లాంగ్వేజ్‌ను వాడ‌తారు. డేటాబేస్ కోసం కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఫేస్‌బుక్‌, యహూ ఈ లాంగ్వేజ్‌నే వాడుతున్నాయి.                                                      

జన రంజకమైన వార్తలు