• తాజా వార్తలు

ఎవ‌రీ 35వేల మంది గూగుల్ ఇంట‌ర్నెట్ సాథీలు.. మ‌న జీవితాల‌ను ఎలా మార్చ‌బోతున్నారు? 

కులా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్ష‌లాది గ్రామాల్లో ఇది కూడా ఒక చిన్న గ్రామం.  2016 వ‌ర‌కు ఈ ఊరి మ‌హిళ‌ల్లో కొంత మంది ఇంట‌ర్నెట్ గురించి విన్నారు. అంతే త‌ప్ప వారిలో ఎవ‌రూ ఇంట‌ర్నెట్‌ను యాక్సెస్ చేయ‌లేదు. ఇప్పుడా ఆ విలేజ్‌లోని 1,100 మంది మ‌హిళ‌ల‌తోపాటు చుట్టుప‌క్క‌ల గ్రామాల్లోని లేడీస్ కూడా ఏ ప‌ని చేయాల‌న్నా ఇంట‌ర్నెట్ చూస్తున్నారు. పిల్ల‌ల‌కు  చ‌దువులో డౌట్స్ వ‌చ్చినా, వాళ్లు ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాల‌న్నా, ఒంట్లో ఏదైనా న‌ల‌త‌గా అనిపిస్తే దానికి కార‌ణాలేమిటో తెలుసుకోవాల‌న్నా అన్నింటికీ ఇంట‌ర్నెట్ వాడుతున్నారు. అదీ సొంతంగా తామే యాక్సెస్ చేసుకుంటున్నారు. ఏడాదిలోనే ఇంత మార్పు అదీ రూర‌ల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న లేడీస్‌లో ఎలా సాధ్య‌మైంది అంటే దానికి జవాబే గూగుల్ ఇంట‌ర్నెట్ సాథీస్. ఎవ‌రీ ఇంట‌ర్నెట్ సాథీలు.. ఏమా క‌థ చూడండి. 
ఇండియానే ఎందుకు? 
చైనా త‌ర్వాత ప్ర‌పంచంలో అత్యంత ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజ‌ర్లున్న‌ది ఇండియాలోనే.  40 కోట్ల మంది యూజ‌ర్లున్న‌ప్ప‌టికీ  ఇండియాలోని మ‌హిళ‌ల్లో నెట్‌ వినియోగం త‌క్కువే. మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు నెట్‌కు దూర‌మే. అందుకే గూగుల్ త‌న నెక్స్ట్ బిలియ‌న్ ఇనీషియేటివ్‌లో ఇండియాను కూడా చేర్చింది. నెక్స్ట్ బిలియ‌న్ ఇనీషియేటివ్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల సంఖ్య‌ను మ‌రో 100 కోట్లు పెంచ‌డం. దీనిలో భాగంగా సెలెక్ట్ చేసిన గ్రామాల్లో ఇద్ద‌రు ముగ్గురు  యువ‌తుల‌కు  ఇంట‌ర్నెట్ యూజ్ ఏంటి? ఎలా యాక్సెస్ చేయాలి వంటి అంశాల్లో శిక్ష‌ణ ఇస్తారు. వీళ్లనే ఇంటర్నెట్ సాథీస్ అంటారు. వీరు త‌ర్వాత త‌మ విలేజ్‌లోని మిగిలిన స్త్రీల‌కు ఇంట‌ర్నెట్‌పై ట్రైనింగ్ ఇస్తారు. ఇంటి బ‌య‌ట‌కు రావాలంటే నెత్తిన ముసుగు క‌ప్పుకుని గానీ రాని సాంప్ర‌దాయ గ్రామీణ స్త్రీలు కూడా ఇప్పుడు నెట్ పై అవ‌గాహ‌న కోసం ఇంట‌ర్నెట్ సాథీస్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. దీంతో వారు ప్ర‌పంచం గురించి తెలుసుకోగ‌లుగుతున్నార‌ని, పిల్ల‌ల్ని బాగా చ‌దివించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని గూగుల్ చెబుతోంది.  
3 రోజులు.. 7 మాడ్యూల్స్‌
ఒక లావా స్మార్ట్‌ఫోన్‌, సెల్‌కాన్ ట్యాబ్‌, 2జీబీ మంత్లే డేటాతో ఓ పెద్ద  గొడుగు గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ సాథీలు వీటితో ఏ పంచాయ‌తీ భ‌వ‌నం దగ్గ‌రో లేదంటే కాస్త పెద్ద ఇంటి వాకిలిలోనో కూర్చుని విలేజ్‌లో స్త్రీల‌కు ఇంట‌ర్నెట్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు.   మూడు రోజుల‌పాటు ఏడు మాడ్యూల్స్‌లో వారికి  ట్రైనింగ్ ఇస్తారు. ఇంట‌ర్నెట్ సాథీ ప్రోగ్రాం ఏమిటి? ఇంట‌ర్నెట్ ఉప‌యోగాలేంటి?  స్మార్ట్‌ఫోన్ ట్యాబ్‌, పీసీ, ల్యాపీ ఇలా ర‌క‌ర‌కాల సాధ‌నాల్లో దాన్ని ఎలా య‌క్సెస్ చేయాలి? బ‌్రౌజింగ్ ఎలాచేయాలి?   ఇలా మొత్తమ‌న్నీ వివ‌రిస్తారు. స్మార్ట్‌ఫోన్‌లో కాలిక్యులేట‌ర్‌, క్యాలెండ‌ర్‌, రేడియో, కెమెరా ఎలా వాడాలోకూడా నేర్పుతారు.  గూగుల్ ఇప్ప‌టికే 10 వేల గ్రామాల్లో ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేసింది. ఇంట‌ర్నెట్ సాథీలు దాదాపు 35వేల మంది ఉన్నారు.  వీరు ల‌క్ష‌ల మంది గ్రామీణ మ‌హిళ‌ల‌ను ఇంట‌ర్నెట్ యాక్సెస్ చేయ‌గ‌లిగే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు.  

జన రంజకమైన వార్తలు