కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాలకు దేశాలే లాకౌడౌన్ ప్రకటించి ఇళ్లు కదలకుండా కూర్చుంటున్నాయి. మరోవైపు రెండు నెలలపాటు ఎలాంటి బిజినెస్ లేకపోవడంతో నష్టాలు భరించలేక కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. పరిశ్రమల నుంచి మొదలుపెట్టి ఈకామర్స్ కంపెనీల వరకు ప్రస్తుతం ఇదే పరిస్థితి. క్యాబ్ అగ్రిగేటర్ సర్వీస్ ఉబెర్, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా ఇప్పుడు ఇదే బాటలోకి వచ్చాయి. ఉద్యోగాలు తీసేస్తున్నాయి.
ఉబెర్‌లో 600 జాబ్స్ అవుట్
క్యాబ్ అగ్రిగేటర్ బిజినెస్‌లో ఇండియాలో టాప్‌లో ఉన్నఉబెర్ కూడా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. ఇప్పటి వరకు విదేశాల్లోనే జాబ్స్ తీసేసిన ఉబెర్ ఇప్పుడు ఇండియా మీద దృష్టి పెట్టింది. లాక్డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా క్యాబ్స్ తిరగకపోవడం, ఈ ఏడాది అంతా పెద్దగా బిజినెస్ ఉండకపోవచ్చన్న అంచనాలున్న పరిస్థితుల్లో ఉబెర్ ఏకంగా 600 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీకి ఉన్న 2400 మంది ఉద్యోగుల్లో ఇది నాలుగో వంతు. అంటే ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ఒకరి జాబ్ పోయిందన్నమాట.
మరోవైపు ఓలా కూడా1,100 మంది ఉద్యోగాలు తీసేసింది.
జొమాటోలో 520 జాబ్స్ గాయబ్
ఫుడ్ అగ్రిగేటర్ యాప్ జొమాటో తన ఉద్యోగుల్లో 13% మందిని తొలగించింది. అంటే 520 మంది ఎంప్లాయిమెంట్ కోల్పోయారు.
ఇవి కూడా..
|షేర్ చాట్ గతవారం 101 మందిని జాబ్స్‌లో నుంచి తీసేసింది.
ఐబీఎంలోనూ కోత
టెక్నాలజీ దిగ్గజాలైన హ్యులెట్ ప్యాకార్డ్ ఎంటర్‌ప్రైజ్ (హెచ్‌పీఈ), ఐబీఎం.. వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఎన్ఆర్ఐ అర్వింద్ కృష్ణ సారథ్యంలోని ఐబీఎం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియాలోనూ ఉద్యోగుల తొలగింపు ఉండవచ్చని అంచనా. హెచ్‌పీఈ కూడా ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది.