• తాజా వార్తలు

గూగుల్ లో వర్క్ @ హోమ్ చేసినవారి ఖర్చులకు 1000 డాలర్లు

గూగుల్‌లో ఉద్యోగం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ల్లో చాలామంది దీన్ని ఊహించుకోవ‌డానికి కూడా సాహ‌సించ‌రు.  ఎందుకంటే  దానిలో జాబ్ రావాలంటే మామూలు స్కిల్స్ స‌రిపోవ‌ని వారి న‌మ్మ‌కం. అయితే ఒక్క‌సారి గూగుల్‌లో జాబ్ కొడితే ఆ మజాయే వేరు అంటున్నారు టెకీలు. ఇంత‌కీ అంత కిక్ ఏముంటుంది ఆ జాబ్‌లో అంటారా?  గూగుల్ క్యాంప‌స్‌లో ఉద్యోగం పిక్‌నిక్‌లా ఉంటుందంటారు టెక్ నిపుణులు. కావాల్సిన‌వ‌న్నీ అమ‌ర్చిపెట్టి ఉద్యోగితే ది బెస్ట్ అవుట్‌పుట్ తీసుకోవాలన్న‌ది గూగుల్ కాన్సెప్ట్‌. అందుకే గూగుల్ క్యాంప‌స్‌ల్లో జిమ్ నుంచి స్విమ్మింగ్ ఫూల్ వ‌ర‌కు, బార్ రూమ్ నుంచి కెఫెటేరియా వ‌ర‌కూ అన్నీ ఎంప్లాయిస్ కోసం రెడీగా ఉంటాయి. 

వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి 100 డాల‌ర్లు
క‌రోనా నేప‌థ్యంలో దాదాపు గూగుల్ ఉద్యోగులంద‌రూ వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే ‌ జూలై 6 నుంచి గూగుల్ ఆఫీసుల‌ను  పునఃప్రారంభిస్తోంది. వర్క్‌ ఫ్రం హోం నుంచి ఆఫీస్‌కు వచ్చే తమ ఉద్యోగులకు ఫర్నీచర్‌ తదితర ఖర్చుల కోసం వెయ్యి డాలర్లు అంటే మ‌న క‌రెన్సీలో  రూ.75వేలు చొప్పున ఇవ్వాలని   నిర్ణయించింది.  ఎందుకంటే క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది చివరి వరకూ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తారని గూగుల్‌ భావిస్తోంది. అందుకే వారికి అవ‌స‌ర‌మైన‌వి కొనుక్కోవ‌డానికి ఈ అమౌంట్ ఇవ్వ‌బోతోంది. దీంతోటెకీలు, నెటిజ‌న్లు వారెవ్వా అది క‌దా గూగుల్ అంటున్నారు. 

జన రంజకమైన వార్తలు