కరోనా కాలం ఇది. ఉన్న ఉద్యోగాలు పోవడమే గానీ కొత్తగా ఇచ్చేవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా దొరకట్లేదు. ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లు, టీచర్లు, ప్రైవేట్ సెక్టార్లలో పెద్ద జాబులు చేస్తూ కరోనా దెబ్బకు కొలువు పోయినవాళ్లు లక్షల మంది ఉన్నారు. వీళ్లంతా వ్యవసాయం చేసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ పొట్టకూటి కోసం నానాతిప్పలు పడున్నారు. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఈకామర్స్ కంపెనీలు యూత్‌కు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి.
అమెజాన్ 33వేల జాబ్స్
కరోనా వచ్చినా, లాక్‌డౌన్ విధించినా కూడా లాభాల్లోకి దూసుకెళ్లిన అతికొద్ది కంపెనీల్లో అమెజాన్ ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే ఈ పరిస్థితులు అమెజాన్‌కు ప్లస్‌పాయింట్ అయ్యాయి. జనం ఇంట్లో నుంచి కదలడానికి భయపడి ఆన్‌లైన్‌లో వస్తువుల ఆర్డర్ ఇస్తుండటంతో వాటిని వేర్‌హౌస్‌ల్లో ప్యాక్ చేసే దగ్గర నుంచి ఇంటింటికీ డెలివరీ ఇచ్చేవరకూ బోల్డంత ఎక్సట్రా సిబ్బంది అవసరమవుతున్నారు. లక్షా 75 వేల మందిని కొత్తగా సప్లై చైన్‌లో నియమించుకోవాలని అమెజాన్ భావిస్తోంది. ఇందులో అమెరికా, కెనడాలతోపాటు ఇండియా కూడా ఉంది. ఇండియాలో సప్లై చైన్ కోసం 30వేల ఉద్యగాలిస్తుందని అంచనా. 15వేలకు పైగా ప్రారంభ జీతంతో ఈ జాబ్స్ ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో 70వేలు
మరోవైపు ఇండియన్ ఈకామర్స్ లెజెండ్ ఫ్లిప్‌కార్ట్ కూడా 70వేల జాబ్స్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.పండుగ సీజన్‌తోపాటు వచ్చే నెలలో ఫ్లాగ్‌షిప్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో డిమాండ్‌ను తట్టుకోవడానికి పెద్ద జాబ్స్ ఇవ్వబోతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈకార్ట్ అండ్ మార్కెట్ ప్లేస్ ఉపాధ్యక్షుడు అమితేష్ ఝా మాట్లాడుతూ.. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా యూత్‌కు అవకాశాలు ఇస్తామని ప్రకటించారు.