జూమ్ యాప్.. వీడియో కాన్ఫరెన్స్‌లకు లాక్‌డౌన్ టైమ్‌లో సాధారణ ఉద్యోగుల నుంచి సెంట్రల్ మినిస్టర్ల వరకు దీన్ని వాడుతున్నారు. అయితే జూమ్ యాప్ ద్వారా హ్యాకర్స్ కాన్ఫరెన్స్ కాల్స్‌లోకి చొరబడి డేటా కొట్టేస్తున్నారన్న వార్తలతో అందరూ అప్రమత్తమయ్యారు. ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే ఈ యాప్ వాడొద్దని తమ మంత్రులందరికీ సూచించింది. దీన్ని బట్టి డేటా చోరీ జరగడం నిజమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టప్‌లకు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది.
ఏం కావాలంటే..
ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫాంను డిజైన్ చేయాలని స్టార్టప్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోరింది.
* ఈ ఫ్లాట్‌ఫాం అన్ని రకాల వీడియో, ఆడియో క్వాలిటీలను సపోర్ట్ చేయాలి. ఎంత లోక్వాలిటీలో ఉన్నా పని చేయాలి.
* అన్ని రకాల డివైస్‌లు ఆండ్రాయిడ్, ఐవోఎస్, ల్యాప్‌టాప్, పీసీ ఇలా అన్నింటిలోనూ పని చేయాలి. సాధ్యమైనంత ఎక్కువ మంది ఒకేసారి వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌కు వీలుగా దీన్ని డిజైన్ చేయాలి.
* నెట్‌వర్క్ స్ట్రాంగ్‌గా ఉన్నా, వీక్‌గా ఉన్నా కూడా ప్రభావవంతంగా పని చేయాలి.
ప్రోటో టైప్ తయారు చేస్తే 5లక్షలు
* ఆసక్తి ఉన్న స్టార్టప్ కంపెనీలు MeitY వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ఏప్రిల్ 30 వరకు రిజిస్ట్రేషన్‌కు టైమ్ ఉంది.
* తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్ డెవలప్ చేయడానికి ఇలా వచ్చినవారి నుంచి 10 టీమ్‌లను సెలెక్ట్ చేస్తారు.
* సెలెక్ట్ అయిన టీమ్స్‌కు ప్రోటోటైప్ తయారు చేయడానికి రూ.5 లక్షల క్యాష్ ఇస్తారు.
* ప్రోటోటైప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 10టీమ్స్‌లో నుంచి మూడు టీమ్‌లను షార్ట్ లిస్ట్ చేస్తారు.
* ఈ మూడు టీమ్స్‌కు 20 లక్షల చొప్పున ఇస్తారు.
* ఫైనల్‌గా ఒక టీమ్ తయారు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌ఫ్లాట్‌ఫామ్‌ను సెలెక్ట్ చేస్తారు.
* విజేతగా నిలిచిన టీమ్‌కు రూ.కోటి ఇచ్చి ఆ సొల్యూషన్‌ను ఏర్పాటు చేయమంటారు. ఆపరేషన్స్, మెయింటనెన్స్ కోసం రూ.10 లక్షలు అదనంగా ఇస్తారు.